ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గిరిజనుల ఆరోగ్య భద్రతకు సమన్వయంతో పనిచేయాలి’

ABN, First Publish Date - 2020-10-02T08:53:56+05:30

గిరిజనుల ఆరోగ్య భద్రతకు పూర్తి భరోసా కల్పించే విధంగా వైద్య, ఆరోగ్య, మహిళా-శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ప్రవీణ్‌ ఆదిత్య కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంపచోడవరం, అక్టోబరు 1: గిరిజనుల ఆరోగ్య భద్రతకు పూర్తి భరోసా కల్పించే విధంగా వైద్య, ఆరోగ్య, మహిళా-శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ప్రవీణ్‌ ఆదిత్య కోరారు. గురువారం ఆయన రెండు శాఖల అధికారులతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు. మలేరియా నియంత్రణ చర్యలు, ఇమ్యూనైజేషన్‌, గర్భిణుల నమోదు, మాతా-శిశు సంరక్షణ చర్యలు, పీహెచ్‌సీల్లో నాడు-నేడు పనుల నిర్వహణ, వైఎస్సీర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ అమలు, వైద్య సేవల ప్రగతిపై సమీక్షించారు.


హైరిస్క్‌ గర్భిణుల పట్ల దత్తత సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రంపచోడవరానికి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి మంజూరైందన్నారు. డీఎంవో పీవీ సత్యనారాయణ, వైద్యాధికారి పాపారావు, సబ్‌ యూనిట్‌ అధికారి రామకృష్ణ, ఎంపీహెచ్‌వో గోవిందబాబు, సీడీపీవోలు నీలవేణి, మాధవి, వరహాలు, రత్న      కుమారి పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-02T08:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising