ఐటీడీఏ పీవో హామీతో దీక్షలు విరమణ
ABN, First Publish Date - 2020-10-01T07:42:20+05:30
పోలవరం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని మండల ప్రజలు 26 రోజులుగా చేస్తున్న రిలే దీక్షలు ఎట్టకేలకు ముగిశాయి.
కూనవరం, సెప్టెంబరు 30: పోలవరం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని మండల ప్రజలు 26 రోజులుగా చేస్తున్న రిలే దీక్షలు ఎట్టకేలకు ముగిశాయి. బుధవారం చింతూరు ఐటీడీఏ పీవో ఆకు ల వెంకటరమణ అక్కడకు వచ్చి ప్యాకేజీ విషయమై హామీ ఇవ్వడడంతో దీక్షలు విరమించారు.
సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, పోలవరం సమస్యలపై పదిరోజుల్లో కూనవరంలో నిర్వాసితులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకుంటామని హామీఇచ్చారు. పీవో నిమ్మరసం ఇచ్చి వారితో దీక్ష విరమింపజేశారు. ఎంపీడీవో కె.సత్యనారాయణమూర్తి, తహశీల్దార్ కేఎల్ నారాయణరావు, నిర్వాసితుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-01T07:42:20+05:30 IST