ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ చార్జీల పెంపు!

ABN, First Publish Date - 2020-05-23T09:20:51+05:30

పేదల ఉసురు తీయడానికేనా విద్యుత్‌ చార్జీల పెంపుదల అని రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి వరుపుల రాజా 

పలు చోట్ల పార్టీ నాయకుల నిరసన దీక్షలు


ప్రత్తిపాడు/ఏలేశ్వరం/రౌతులపూడి/కత్తిపూడి: మే 22: పేదల ఉసురు తీయడానికేనా విద్యుత్‌ చార్జీల పెంపుదల అని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి వరుపుల రాజా నిలదీశారు. విద్యుత్‌ చార్జీల పెంపుదలను నిరసిస్తూ శుక్రవారం టీడీపీ కార్యాలయంలో చేపట్టిన 12 గంటల దీక్షను ఆయన ప్రారంభించారు. దీక్షలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ కొమ్ముల కన్నబాబు, కొట్టేటి అబ్బులు, రావూరి తాతాజీ, బత్తుల నాగార్జున, మిరియాల శ్రీను, తటవర్తి సుబ్బారావు, వై.కుమార్‌, ఎం.శ్రీను, బుక్క సత్తిబాబు సీబీఎన్‌ ఆర్మీ సమన్వయకర్త యాళ్ల జగదీష్‌, జల్లిగంపల ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.


ఏలేశ్వరంలోతెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు పైల సుభాష్‌చంద్రబోస్‌ నేతృత్వంలో, రౌతులపూడి మండలం ఎ.మల్లవరంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లి సూరిబాబు నివాసంలో, శంఖవరం మండలం కత్తిపూడిలో వెన్నా ఈశ్వరుడు నివాసంలో టీడీపీ నాయకులు 12 గంటల నిరసన దీక్ష చేపట్టారు. 


పిఠాపురం: శ్లాబుల మార్పు పేరుతో ప్రజలపై విద్యుత్‌ చార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన దీక్ష చేపట్టారు. వర్మ మాట్లాడుతూ తక్షణం విద్యుత్‌ చార్జ్జీల శ్లాబులను యథాతథంగా ఉంచడంతో పాటు మూడు నెలల విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని వర్మ డిమాండ్‌ చేశారు. నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-23T09:20:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising