ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదనపు కట్నం కోసం భార్యపై దాడి

ABN, First Publish Date - 2020-12-13T06:30:56+05:30

మండపేట, డిసెంబరు 12: అదనపు కట్నం కోసం భార్య,కుటుంబ సభ్యులపై భర్త,అతడి తండ్రి దాడికి పాల్పడిన సంఘటన మండపేట మండలం ఏడిదలో శనివారం జరిగింది. మండపేట రూరల్‌ ఎస్‌ఐ పీతల దొరైరాజు తెలిపిన వివరాల ప్రకారం... మండపేట మండలం ఏడిదకు చెందిన ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండపేట, డిసెంబరు 12: అదనపు కట్నం కోసం భార్య,కుటుంబ సభ్యులపై భర్త,అతడి తండ్రి దాడికి పాల్పడిన సంఘటన మండపేట మండలం ఏడిదలో శనివారం జరిగింది. మండపేట రూరల్‌ ఎస్‌ఐ పీతల దొరైరాజు తెలిపిన వివరాల ప్రకారం... మండపేట మండలం ఏడిదకు చెందిన లహరికి, పాలతోడుకు చెందిన యేలేటి అనుష్‌ చౌదరితో మూడేళ్ల క్రితం వివాహామైంది. వివాహ సమయంలో రెండు ఇళ్ల స్థలాలతోపాటు రూ.10 లక్షల నగదు, 30 తులాల బంగారం కట్నంగా వధువు తల్లితండ్రులు వరుడికి ఇచ్చారు. వివాహమైన తర్వాత లహరి అత్త మాణిక్కం, మామ వెంకట్రావు, ఆడపడుచు నిమ్మలపూడి మాధవి వేధింపులకు గురిచేస్తుండేవారు. లహరి జూన్‌లో ఆడబిడ్డకు జన్మనివ్వడంతో పుట్టింటి వద్ద ఉంటుంది. శనివారం లహరి భర్త తన తండ్రి వెంకట్రాజుతో భార్య వద్దకు వెళ్లాడు. అదనపు కట్నం ఎందుకు తీసుకురాలేదని భార్యను చితక్కొట్టాడు. అడ్డువచ్చిన లహరి సోదరుడు, కుటుంబసభ్యులపై ఆ తండ్రి,కొడుకులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై లహరి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.  


Updated Date - 2020-12-13T06:30:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising