ఇళ్ల పట్టాల పంపిణీపై రగడ
ABN, First Publish Date - 2020-12-29T05:59:07+05:30
నిజమైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు తొలగించారని లబ్ధిదారులకు ఆందోళనకు దిగారు. పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
- నిజమైన లబ్ధిదారులను తొలగించారంటూ ఆందోళన
గండేపల్లి, డిసెంబరు 28: మండలంలోని మురారిలో అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదంటూ ఇటీవలే జాతీయ రహదారిపై లబ్ధిదారులు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 29 తేదీన మంగళవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నిర్వహించనున్న నేపథ్యంలో తహశీల్దార్ చిన్నారావు పంచాయతీ కార్యాలయ ఆవరణలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నాయకులు లబ్ధిదారులు హాజరయ్యారు. నిజమైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు తొలగించారని లబ్ధిదారులకు ఆందోళనకు దిగారు. పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు, లబ్ధిదారులకు మధ్య రగడ నెలకొంది. తహశీల్దార్ మాట్లాడుతూ గ్రామంలోని లబ్ధిదారులకు న్యాయం చేస్తామని ప్రతీఒక్కరు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో లబ్ధిదారులు శాంతించారు.
Updated Date - 2020-12-29T05:59:07+05:30 IST