ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిఠాపురంలో భారీ వర్షం

ABN, First Publish Date - 2020-09-26T09:09:39+05:30

పట్టణంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం పది నుంచి 12.30 గంటల వరకూ ఏకదాటిగా వర్షం కురవడంతో రహదారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం, సెప్టెంబరు 25: పట్టణంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం పది నుంచి 12.30 గంటల వరకూ ఏకదాటిగా వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. డ్రెయిన్లు పొంగిపొర్లి రోడ్లపైకి నీరు చేరింది. అంబేద్కర్‌ సెంటర్‌, పాతబస్టాండు, చర్చి సెంటర్‌, ఆర్టీసీ కాంప్లెక్సు, మంగాయామ్మరావుపేట తదితర ప్రాంతాల్లో సుమారు అడుగున్నర ఎత్తున వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 4 రోజులుగా ఎండతీవ్రత, ఉక్కపోతతో సతమతమైన ప్రజలు చల్లబడిన వాతావరణంతో సేదతీరారు. 


రైతుల కలవరం

సామర్లకోట: ప్రస్తుతం వర్షాభావ వాతావరణ పరిస్థితులతో సామర్లకోట మండల, పట్టణ పరిధిలోని రైతులు కలవరం చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు ప్రారంభం నుంచీ ఖరీఫ్‌ కష్టాలు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరిసాగు చేపట్టి 50రోజులు పైబడి చిరుపొట్ట దశ, ఈనిక దశల్లో ఉండగా ఎలుకల బెడద అధికమైందని సతమతమవుతున్న నేపఽథ్యంలో 2రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంపు సమస్య పొంచి ఉందని వాపోతున్నారు.

Updated Date - 2020-09-26T09:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising