అందరి సహకరంతో అభివృద్ధికి కృషి చేస్తా
ABN, First Publish Date - 2020-11-13T08:03:07+05:30
ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సహకారంతో గుడా అభివృద్ధికి కృషి చేస్తానని రవీంద్రనాథ్ అన్నారు. గురువారం గోదావరి అర్బన డెవల్‌పమెంట్ అథారిటీ (గుడా) వైస్ చైర్మన్‌గా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
గుడా వీసీగా రవీంద్రనాథ్ బాధ్యతలు స్వీకరణ
కార్పొరేషన్ (కాకినాడ), నవంబరు 12: ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సహకారంతో గుడా అభివృద్ధికి కృషి చేస్తానని రవీంద్రనాథ్ అన్నారు. గురువారం గోదావరి అర్బన డెవల్‌పమెంట్ అథారిటీ (గుడా) వైస్ చైర్మన్‌గా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాతో తనకు ముందునుంచి అనుబంధం ఉందని, స్టాంప్ అండ్ రిజషే్ట్రషన్‌శాఖలో పనిచేశానని గుర్తుచేశారు. గుడా ఇప్పటివరకూ ఎంతో అభివృద్ధి చెందిందని, ఇకపై ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్తానని తెలిపారు. ఆయన్ని గుడా అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో సాదరంగా ఆహ్వానించారు.
Updated Date - 2020-11-13T08:03:07+05:30 IST