ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదాదేవి గ్రామోత్సవం

ABN, First Publish Date - 2020-12-19T07:07:44+05:30

ధనుర్మాసోత్సవాల్లో భాగం గా కోనసీమ తిరుపతి వాడపల్లి వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో ఽశుక్రవారం గోదాదేవి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్రేయపురం, డిసెంబరు 18: ధనుర్మాసోత్సవాల్లో భాగం గా కోనసీమ తిరుపతి వాడపల్లి వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో ఽశుక్రవారం గోదాదేవి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వే కువజామునే స్వామివారికి గోదావరి జలాలతో అభిషేకాలునిర్వహించారు. తొలి శుక్రవారం గోదా దేవికి ప్రత్యేక పూజలు, తిరుప్పావై సేవాకాలం జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు స్వామివారికి అష్టోత్తర పూజలు, కల్యాణాలు జరిపి అన్నదాన ట్రస్టుకు విరాళాలు అందజేశారు. 


నవజనార్థన క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

రావులపాలెం రూరల్‌, డిసెంబరు 18: ధనుర్మాసం సందర్భంగా నవ జనార్థన క్షేత్రాలకు, సప్త శ్రీనివాస క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్‌ అజితకుమారి తెలిపారు. ఈనెల25న ముక్కోటి ఏకాదశి సందర్భంగా సప్తశ్రీనివాస క్షేత్రాలైన మండపేట, యానాం, అప్పనపల్లి, అబ్బిరాజుపాలెం, కొడమంచిలి, అన్నవరప్పాడు, వాడపల్లి దర్శనానికి ఉదయం ఐదు గంటలకు బస్సు బయలుదేరుతున్నట్టు తెలిపారు. ధవళేశ్వరం, మడికి, జొన్నాడ, ఆలమూరు, మండపేట, కపిలేశ్వరపురం, కోరుమిల్లి, మాచర, కోటిపల్లిలలో నారద మహర్షితో ప్రతిష్ఠింపబడిన నవజనార్ధన స్వామి దర్శనానికి బస్సులు నడుపుతున్నామని తెలిపారు.

Updated Date - 2020-12-19T07:07:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising