ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్డింగ్‌పై నుంచి పడి తాపీ మేస్త్రీ మృతి

ABN, First Publish Date - 2020-10-28T05:39:34+05:30

ప్రమాదవశాత్తూ బిల్డింగ్‌పై నుంచి కిందపడిన ఓ తాపీ మేస్త్రీ ని కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీజీహెచ్‌(కాకినాడ), అక్టోబరు27: ప్రమాదవశాత్తూ బిల్డింగ్‌పై నుంచి కిందపడిన ఓ తాపీ మేస్త్రీ ని కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కాకినాడ రూరల్‌ మండలం, ఇంద్రపాలెం గ్రామానికి చెందిన కోన ధన (39) తాపీ మేస్త్రీగా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను కాకినాడ, అచ్యుతాపురం కరణంగారి సెంటర్‌లో మంగళవారం నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌ రెండో అంతస్తు పరంజిపై నిలబడి ప్లాస్టింగ్‌ పని చేస్తున్నాడు. అయితే ప్రమాదవశాత్తూ పరంజి విరిగిపోవడంతో ధన అక్కడి నుంచి ఒక్కసారిగా కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అది గమనించిన సహచరులు, స్థానికులు క్షతగాత్రుడిని 108 వాహనంపై జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-10-28T05:39:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising