ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాత్ముడే మనకు ఆదర్శం

ABN, First Publish Date - 2020-10-03T06:30:24+05:30

కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడిపోయిన భారతదేశాన్ని సమైఖ్యపరచి అహింసా మార్గంలో దేశ స్వాతంత్ర్యానికి పాటుపడిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నన్నయ’ వీసీ ఆచార్య  మొక్కా జగన్నాథరావు 

గ్రామాల్లో ఘనంగా గాంధీ జయంతి


దివాన్‌చెరువు, అక్టోబరు 2: కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడిపోయిన భారతదేశాన్ని సమైఖ్యపరచి అహింసా మార్గంలో దేశ స్వాతంత్ర్యానికి పాటుపడిన మహాత్మ గాంధీ మనందరికీ ఆదర్శం కావాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య  మొక్కా జగన్నాథరావు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో గాంధీ 151వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఈసీ సభ్యులు కొట్టి శ్రీరమేష్‌, బి.జగన్మోహనరెడ్డి, ప్రిన్సిపాల్స్‌ కె.రమణేశ్వరి, కె.సుబ్బారావు, డివోఏ జ్యోతిర్మయి, డీన్స్‌ శ్రీనివాసరావు, మట్టారెడ్డి పాల్గొన్నారు. అలాగే ఎన్‌ఎ్‌సఎ్‌స విభాగం ఆధ్వర్యంలో రిలవెన్స్‌ ఆఫ్‌ గాంధీజం ఇన్‌ టుడేస్‌ యూత్‌ అంశంపై వెబినార్‌ నిర్వహించారు. ఎన్‌ఎ్‌సఎ్‌స కోఆర్డినేటర్‌ బికెజియారాణి కన్వీనర్‌గా వ్యవహరించారు. వీసీ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ గాంధీ నిరాడంబరంగా జీవిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ గాంధీయన్‌ స్టడీస్‌ సెంటర్‌ ఆచార్య ఎబిఎ్‌సవి రంగారావు రీసోర్స్‌పర్సన్‌గా పాల్గొన్నారు. 


దివాన్‌చెరువు పంచాయితీ పరిధిలోని శ్రీరాంపురంలో గాంధీ విగ్రహాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. గ్లౌజులు, డ్రైప్రూట్స్‌ అందజేశారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో జానా సత్యనారాయణ, పంచాయితీ కార్యదర్శి సత్తిరాజు ఉపాధి ఏపీవో వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు. పాలచర్లలో గాంధీ విగ్రహానికి స్థానిక నాయకులు గంగిశెట్టి సోమేశ్వరరావు, గంగిశెట్టి చంటిబాబు, ఆత్మకమిటీ రాజమహేంద్రవరం డివిజన్‌ చైర్మన్‌ నాళం రోశయ్య, తాతారావు, గ్రంధి నానబ్బు నివాళులర్పించారు. దివాన్‌చెరువులో 50 మంది ఆటో కార్మికులకు లియో ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు మోహన్‌పెన్నాడ ఆధ్వర్యంలో సజ్జాశ్రీనివాసరావు సహకారంతో కూరగాయలు పంపిణీ చేశారు. 


రాజమహేంద్రవరం సిటీ: దానవాయిపేట గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, టీడీపీ యువనేత ఆదిరెడ్డి పూలమాలలతో నివాళులర్పించారు. టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశీ నవీన్‌ కుమార్‌, పార్లమెంట్‌ నియోజకవ ర్గ మహిళ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, వీరా రాము, విశనాధరాజు, కెవెంకటేశ్వర్లు, సుజాత, పొన్నాడ ప్రసాద్‌, బొచ్చు శ్రీను, కందన సూరిబాబు పాల్గొన్నారు. సమా జ సేవకుడు పడాల శ్రీనివాస్‌ పాల్‌చౌక్‌లో వృద్ధులు భోజనాలు పెట్టారు. 


రాజమహేంద్రవరం అర్బన్‌: ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.డేవిడ్‌కుమార్‌, ఇతర అధ్యాపకులు కళాశాల ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గెస్ట్‌ లెక్చర్‌లో డిగ్రీ కళాశాల రిటైర్డు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజారావు ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా గాంధీమార్గం అంశంపై మాట్లాడారు. రాజనీతిశాస్త్ర విభాగాధిపతి పి.బాబ్జీ, డాక్టర్‌ సీతామహాలక్ష్మి కస్తూరి, శ్రీశైల శాస్త్రి, డాక్టర్‌ కెప్టెన్‌ డి.రుద్ర, డాక్టర్‌ కె.రామచంద్రరావు, డాక్టర్‌ సుధామయి, డాక్టర్‌ పి.షణ్ముఖరావు పాల్గొన్నారు. మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌శాస్త్రి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.


గోదావరి సిటీ: సమరయోధుల పార్కులో ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్‌ అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యుక్షురాలు రేలంగి శ్రీదేవి గాంధీకి నివాళులర్పించారు. సమితి కార్యదర్శి పెదిరెడ్ల శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌ పాల్గొన్నారు. గోకవరం బస్టాండ్‌ వద్ద ఎస్పీ బాలు సాంస్కృతిక మందిరంలో (రాకా) అధ్యక్షుడు డాక్టర్‌ కంటే వీరన్న చౌదరి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సమాజసేవకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, పి.అనూప్‌ కుమార్‌ జైన్లలను సత్కరించారు. రాకా ప్రధాన కార్యదర్శి జివిరమణ, కోశాధికారి సూరపురెడ్డి తాతారావు, సహాయక కార్యదర్శి గౌరిశంకరరావు పాల్గొన్నారు. ఆదిత్య ఎన్‌ఎ్‌సఎస్‌ వాలంటీర్లు దామెర్ల ఆర్ట్‌ గ్యాలరీలో మొక్కలు నాటారు. ఫ్రెండ్స్‌ సర్వీస్‌ సొసైటీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆదిత్య ఎన్‌ఎ్‌సఎస్‌ పీవోలు డా.జివియ్‌స. నాగేశ్వరరావు, బిహెచ్‌వి.రమాదేవి పాల్గొన్నారు. కందుకూరి రాజ్యలక్ష్మి మహిళ డీఎడ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మన్యం ఉమాదేవి అధ్యక్షతన వైసీపీ నాయకురాలు మేడపాటి షర్మిలారెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నేతపని, వడ్రంగిపని, ఇనపపని వంటి వృత్తులు చేస్తున్న వారందరికి ఫేస్‌ షీల్డులు, మాస్క్‌లను పంపిణీ చేశారు.


కడియం: కడియం బస్టాండు సమీపంలో గాంధీజీ విగ్రహానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉత్తమ ఉపాధ్యాయుడు చిలుకూరి శ్రీనివాసరావు, చిక్కాల శ్రీను, చిలుకూరి ప్రసాద్‌ పాల్గొన్నారు. కడియం వైశ్యా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేతి నానాజీ, లక్కింశెట్టి రమేష్‌, గ్రంధి నాగేశ్వరరావు, పాల్గొన్నారు. 


ధవళేశ్వరం: గోదావరి కల్చరల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో రాధాకృష్ణ కళాక్షేత్రంలో అధ్యక్ష, కార్యదర్శులు రాకా రమణ, యర్రమోతు ధర్మరాజు, సభ్యులు గాంధీ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. లాక్‌డౌన్‌లో పేదలకు అన్నదానం, నిత్యావసర సరకుల వితరణ చేపట్టిన సావాడ శ్రీనివాసరెడ్డి, రాధాకృష్ణ కళాక్షేత్ర నిర్వాహకుడు జిబద్రినారాయణ, గ్రామంలోని హిందూ శ్మశానవాటికను సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేసిన సిటీకేబుల్‌ వెంకటేశ్వరరావును సత్కరించారు. 


రాజానగరం: రాజానగరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రాజమహేంద్రవరం డీఎల్‌పీవో జానా సత్యనారాయణ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. 


సీతానగరం: సీతానగరంలోని కస్తూర్భాగాంధీ ఆశ్రమంలో మాజీ సర్పంచ్‌ పెందుర్తి నాగరత్నం, ఆశ్రమ ప్రతినిధి సుశీల గాంధి కుటీరంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జాతీయ పతాకాన్ని ఎగరువ వేసి జెండా వందనం చేశారు. ఆశ్రమ వాసుల డా.సత్యం రమే్‌షబాబు, డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌, బొంగురాజారావు తదితరులు పాల్గొన్నారు.


కోరుకొండ: కోరుకొండ సచివాలయం వద్ద ఎంపీడీవో నరే్‌షకుమార్‌ పారిశుధ్య కార్మికులకు నూతన వస్ర్తాలు, పండ్లు అందజేశారు. కోటి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి మతార్‌ బీబీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను సత్కరించారు. బూరుగుపూడిలో కార్యదర్శి శ్రీవల్లి, దోసకాయలపల్లిలో కార్యదర్శి సత్యవాణి, గాడాలలో కార్యదర్శి సత్యానందకుమార్‌, నరసాపురంలో కార్యదర్శి నాగరత్నం, మధురపూడిలో కార్యదర్శి రమే్‌షబాబు, కోరుకొండలో కార్యదర్శి శ్రీరామ్మూర్తి, కాపవరం, శ్రీర ంగపట్నం గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు నూతన వస్ర్తాలతో సత్కరించారు. 


వై.రామవరం: రెండో అంగన్‌వాడీ కేంద్రంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


గంగవరం: మండలంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కస్తూరిభా బాలికా విద్యాలయం, పంచాయతీల వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఎంపీడీవో జాన్‌మిల్టన్‌, ఆర్‌ఐ జిలాని, విద్యాలయం ప్రత్యేకాధికారి పద్మావతి పాల్గొన్నారు.


వరరామచంద్రపురం: వీఆర్‌పురం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్‌, సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  


రాజఒమ్మంగి: గాంధీబొమ్మ సెంటర్‌లో గాంధీకి నివాళులర్పించారు. దూసరపాము మాజీ సర్పంచ్‌ కనిగిరి దుర్గాప్రసాద్‌, మాజీ వైస్‌ సర్పంచ్‌ బంటుపల్లి చంద్రరావు, బొడారపు కృష్ణ, బొంకు దొరబాబు, కృష్ణ పాల్గొన్నారు. రాజవొమ్మంగి గ్రామ సచివాలయంలో సొసైటీ అధ్యక్షుడు సింగిరెడ్డి రామకృష్ణ కార్యదర్శి మలేశ్వర్రావు, వలంటీర్లకు శాలువాలు కప్పి సన్మానించారు. నాయకులు దాట్ల వెంకటేష్‌ రాజ్‌, చీడిపల్లి అప్పారావు, చప్పా ప్రసాద్‌, కనిగిరి వీరబాబు, బంటుపల్లి చంద్ర రావు, కనిగిరి దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు. 


కూనవరం: కూనవరం మేజర్‌ పంచాయతీలో పంచాయతీ ఈవో సురేష్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను సత్కరించారు. వరదల్లో ఉత్తమ సేవలందించిన ఈవో సురేష్‌, ఎంపీడీవో సత్యనారాయణను కూనవరం ప్రజలు సత్కరించారు. 


అనపర్తి: టీడీపీ ఆధ్వర్యంలో అనపర్తి మెయిన్‌రోడ్డులో, ఆంధ్రాబ్యాంక్‌ సమీపంలోని గాంధీ విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ కర్రి శేషారత్నం, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సిరసపల్లి నాగేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, పులగం అచ్చిరెడ్డి పాల్గొన్నారు.


బిక్కవోలు: బిక్కవోలులో గాంధీకి అనపర్తి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జేవీవీ సుబ్బారెడ్డి నివాళులర్పించారు. పలు గ్రామాలలోని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు జ్ఞాపికలు అందించి సత్కరించారు. ఎంపీడీవో అనుపమ, వైసీపీ కన్వీనర్‌ పి.ప్రసాదరెడ్డి, సోసైటీ అధ్యక్షుడు సత్తి హరిప్రసాదరెడ్డి, పాల్గొన్నారు. 


రంగంపేట: పెదరాయవరంలో మనం-మన పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు. కార్యదర్శి కామేశ్వరి, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ ఎం.గోవిందు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T06:30:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising