ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గండేపల్లి సొసైటీ అవినీతి ఆరోపణలపై ప్రాథమిక విచారణ

ABN, First Publish Date - 2020-09-29T17:56:01+05:30

గండేపల్లి సొసైటీలో జరిగిన అవినీతి ఆరోపణలపై త్రిసభ్య కమిటీ ప్రాథమిక విచారణ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గండేపల్లి: గండేపల్లి సొసైటీలో జరిగిన అవినీతి ఆరోపణలపై త్రిసభ్య కమిటీ ప్రాథమిక విచారణ నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం డివిజినల్‌ కోఆపరేటివ్‌ ఆఫీసర్‌ ఎ.రాథాకృష్ట తెలిపారు. సొసైటీ కార్యాలయానికి విచారణ నిర్వహించేందుకు సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ రూ.42కోట్లటర్నోవర్‌ కలిగిన సొసైటీలో 1200మంది సభ్యులు ఉన్నారని, దీనిలో 900మంది రైతులు వివిధ రకాలుగా రుణాలు తీసుకున్నారని తెలిపారు. గత శనివారం రికార్డులను సీజ్‌ చేసి వెళ్లామని ఈరోజు నుంచి ప్రాథమిక విచారణ నిర్వహిస్తున్నామన్నారు.


తర్వాత రికార్డుల్లో ఉన్న లోపాలను వెలికితీసి కాకినాడ డీటీవో కార్యాలయానికి నివేదిక అందజేస్తామన్నారు. వాటిలో వచ్చే లోపాలు, అవినీతిని బట్టి జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో 51 ఎంక్వయిరీ వేస్తారన్నారు. విచారణలో పెద్దాపురం అసిస్టెంట్‌ రిజిస్టర్‌ బి.శివకుమార్‌, ప్రత్తిపాడు అసిస్టెంట్‌ రిజిస్టర్‌ కె.చంద్రశేఖర్‌, సొసైటీ పాలకవర్గ అధ్యక్షుడు సానిపిని విశేశ్వరరావు తారకం గండేపల్లి సహకార బ్యాంక్‌ మేనేజర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-29T17:56:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising