ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీ భూములను సంరక్షించాలి

ABN, First Publish Date - 2020-05-22T09:36:58+05:30

జిల్లాలో అటవీ భూముల సంరక్షణలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ, మే 21 (ఆంధ్రజ్యోతి)/ రంపచోడవరం: జిల్లాలో అటవీ భూముల సంరక్షణలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన అధ్యక్షతన అటవీ పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ రెవెన్యూ, పోలీస్‌, అటవీ శాఖాఽధికారులు సమన్వయంతో ప్రత్యేక పర్యవేక్షణలో భూములు కాపాడాలన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం కింద ఎస్టీ తెగల గ్రామాలకు రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు గురించి చర్చించారు. అటవీ భూముల పరిసరాల్లో ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టుల ఏర్పాటుకు కమిటీ తీర్మానించింది. 


జనవరి 14వ తేదీ వరకు క్లయిమ్‌దారుల నుంచి తీసుకున్న దరఖాస్తులను నిశితంగా పరిశీలించడంతో పాటు సర్వే నివేదికలు, నిబంధనల మేరకు అర్హులను గుర్తించి పట్టాల జారీకి చర్యలు  చేపట్టాలన్నారు. వచ్చే ఆగస్టు 9న అర్హులకు పట్టాలు పంపిణీ చేస్తామన్నారు.  సబ్‌కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ప్రవీణ్‌ ఆదిత్య మాట్లాడుతూ 2005, డిసెంబరు 13 నాటికి సాగులో ఉన్న కొండపోడు భూములకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం హక్కులు సంక్రమిస్తాయన్నారు. ఇందుకు అవసరమైన సర్వేలు, జీపీఆర్‌ ఎస్‌ సర్వే లు, జాయింట్‌ తనిఖీలు చేపట్టామని తెలిపారు.  సమావేశంలో డీఎఫ్‌వో నందిని సలారియా, చింతూరు డీఎఫ్‌వో, రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌, డీఆర్వో సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.


స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు

జిల్లాలో ఉన్న మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేయడానికి పరిపాలనపరమైన అనుమతులు లభించాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. వెలగపూడి నుంచి భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎం.గౌతంరెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తొలుత అంబాజీపేట ఉద్యాన వన కేంద్రంలో ఐదు ఎకరాల భూమి కేటాయింపునకు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామన్నారు. కాకినాడలో ఆంధ్రా పాలిటెక్నిక్‌లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరంలో కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 

Updated Date - 2020-05-22T09:36:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising