ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు రూ.10 వేలు అడ్వాన్స్‌ చెల్లించాలి

ABN, First Publish Date - 2020-12-28T06:00:15+05:30

ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న ధాన్యం బిల్లులకు తీవ్రజాప్యం అవుతున్నందున సంక్రాంతికి అడ్వాన్సుగా రూ.10 వేలు చొప్పున ధాన్యం విక్రయించనున్న ప్రతీ రైతుఖాతాకు ప్రభుత్వం జమ చేయాలని తెలుగు రైతు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ పాలకుర్తి శ్రీనుబాబు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  తెలుగు రైతు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ శ్రీనుబాబు

సామర్లకోట, డిసెంబరు 27: ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న ధాన్యం బిల్లులకు తీవ్రజాప్యం అవుతున్నందున సంక్రాంతికి అడ్వాన్సుగా రూ.10 వేలు చొప్పున ధాన్యం విక్రయించనున్న ప్రతీ రైతుఖాతాకు ప్రభుత్వం జమ చేయాలని తెలుగు రైతు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ పాలకుర్తి శ్రీనుబాబు డిమాండ్‌ చేశారు. సామర్లకోటలో ఆదివారం విలేకరులతో మాట్లా డుతూ జిలాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ళు చేస్తున్నప్పటికీ రైతుబ్యాంకు ఖాతాలో డబ్బులు సకాలంలో జమ కావడం లేదన్నారు. మోటార్లకు మీటర్లతో అనేక సమస్యలున్నాయని రైతులు మొరపె ట్టుకుంటున్నా ప్రభుత్వం మొండిగా మీటర్ల ఏర్పాటుకు ముందుకెళుతుండడం దారుణమన్నారు. ఈనెల 28,29,30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా రైతుకోసం-తెలుగుదేశం పేరిట నిరసన కార్యక్రమాలు చేయనున్నట్టు శ్రీనుబాబు చెప్పారు. కాకినాడ పార్లమెంటరీ పరిధిలో ఏడు నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహలు చేస్తున్నామన్నారు. 28న ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరామర్శ, 29న రైతు భరోసా కేంద్రాల వద్ద వరదలకు నష్టపోయిన పంట నష్టాల నమోదు వివరాల పరిశీలన, 30న కౌలు రైతులకు సంబంధించిన కార్యక్రమాలు పరిశీలన వంటి చేపట్టనున్నట్టు శ్రీనుబాబు చెప్పారు.

Updated Date - 2020-12-28T06:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising