ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో రక్షణ దళాలు ఏర్పాటు

ABN, First Publish Date - 2020-10-01T08:55:12+05:30

ప్రజలంతా శాంతియుతంగా ఉంటూ మత సామరస్యాన్ని కాపాడేందుకు కృషిచేయాలని ఉమెన్‌ ఎస్‌ఐ భవానీ కోరారు. బుధవారం అప్పనరామునిలంక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతర్వేది, సెప్టెంబరు 30: ప్రజలంతా శాంతియుతంగా ఉంటూ మత సామరస్యాన్ని కాపాడేందుకు కృషిచేయాలని ఉమెన్‌ ఎస్‌ఐ భవానీ కోరారు. బుధవారం అప్పనరామునిలంక, వీవీమెరక గ్రామాల్లో  యువకులు, గ్రామస్థులతో గ్రామ రక్షణ దళ సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు. అంతర్వేది సంఘటన తరువాత దేవాలయాలు, మసీదులు, చర్చిలవద్ద ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాంతి కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.


రాత్రిపూట ఆలయాలు, మసీదులు, చర్చిల వద్ద భద్రత కోసం గ్రామాల్లో ఉన్న ఔత్సాహిక యువకులు ఐదుగురిని ఎంపికచేసి గ్రామరక్షణ దళాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మోరి, అంతర్వేది తదితర గ్రామాల్లో ఎస్‌ఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ రక్షణ దళాల సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లతోపాటు ఆలయాలవద్ద, మసీదులు, చర్చిల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుపై వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-10-01T08:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising