ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములవ్వాలి

ABN, First Publish Date - 2020-10-03T06:13:54+05:30

మండలంలోని లింగంపర్తిలో ఎంపీడీవో రత్నకుమారీ, గ్రామ కార్యదర్శి మోహన్‌కుమార్‌, ఏలేశ్వరం పట్టణంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలేశ్వరం, అక్టోబరు 2: మండలంలోని లింగంపర్తిలో ఎంపీడీవో రత్నకుమారీ, గ్రామ కార్యదర్శి మోహన్‌కుమార్‌, ఏలేశ్వరం పట్టణంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద కమిషనర్‌ కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో మనం-మన పరిశుభ్రత, స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన సదస్సులకు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పరిశుభ్రత పక్షోత్సవాలను ప్రారంభించి ప్రసంగించారు. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములవ్వాలన్నారు. అధికారులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.


కరోనా వారియర్స్‌గా సేవలందించిన పారిశుధ్య కార్మికులను సన్మానించారు. అలాగే సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలు ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్న వలంటీర్లు, అధికారులను సత్కరించి, అభినందనలు తెలిపారు. అనంతరం పట్టణంలోని భవిత కేంద్రంలో జిల్లా సమగ్రశిక్ష ద్వారా మంజూరైన రూ.2 లక్షల విలువైన వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలను మానసిక, దివ్యాంగ చిన్నారులకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంఈవో అబ్బాయి, అలమండ చలమయ్య, ఎస్‌జీవి సుబ్బరాజు, బదిరెడ్డి గోవిందు, చిక్కాల లక్ష్మణరావు, మూది నారాయణస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T06:13:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising