ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాలను కాపాడతాం
ABN, First Publish Date - 2020-11-13T05:44:35+05:30
రాష్ట్రంలో ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాలను కాపాడతామని రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ చైర్మన్ వాసా దివాకర్ పేర్కొన్నారు. గురువారం రామచంద్రపురం తహసీల్దారు కార్యాలయంలో జరిగిన రెవెన్యూ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ చైర్మన వాసా దివాకర్
ద్రాక్షారామ, నవంబరు 12: రాష్ట్రంలో ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాలను కాపాడతామని రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ చైర్మన్ వాసా దివాకర్ పేర్కొన్నారు. గురువారం రామచంద్రపురం తహసీల్దారు కార్యాలయంలో జరిగిన రెవెన్యూ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ శాఖలో వీఆర్‌ఏల నుంచి వీఆర్వోలతో పాటు డిప్యూటీ కలెక్టర్లు వరకు ఒకే సంఘంగా ఉండి పనిచేయాలని నిర్ణయించామన్నారు. రెవెన్యూ ఉద్యోగులతో పాటు ఇతర వర్గాల వారికీ న్యాయం చేసేందుకు సీఎం జగన సిద్ధంగా ఉన్నారన్నారు. కొవిడ్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆలస్యం జరుగుతోందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం 90 శాతం అమ లు చేశారని, మిగిలినవి త్వరలో పరి ష్కారమవుతాయన్నారు. వీఆర్వోల సం ఘం జిల్లా అధ్యక్షుడు బాపూజీ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. డిప్యూటీ తహశీల్దారుగా పదోన్నతి పొందిన యూవీ వర్మ, ఎంఎస్‌వోగా పదోన్నతి పొందిన దివాకర్‌లను సత్కరించారు. సమావేశంలో ఏపీ జీఈఏ అధ్యక్షుడు మూర్తి, కార్యదర్శి కమల్, తహశీల్దారు తేజేశ్వరరావు, డిప్యూటీ తహశీల్దారు వైద్యనాథశర్మ, ఆర్‌ఐ నాయుడు, వీఆర్వోల సంఘం నాయకులు పంపన విష్ణు, మనోహర్, సాయిప్రతిమ, సర్వేయర్లు, వీఆర్‌ఏలు, కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-13T05:44:35+05:30 IST