ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త కవులకు వేదిక కల్పిస్తున్న చిన్నపత్రికలు

ABN, First Publish Date - 2020-07-14T11:27:42+05:30

సోషల్‌ మీడియా ఎంతగా విస్తరించినా ప్రింట్‌ మీడియా అవసరం వుంటూనే ఉందని, అందులోనూ కవిసంధ్య ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌


యానాం, జూలై 13: సోషల్‌ మీడియా ఎంతగా విస్తరించినా ప్రింట్‌ మీడియా అవసరం వుంటూనే ఉందని, అందులోనూ కవిసంధ్య లాంటి చిన్నపత్రికలు సాహిత్య పేజీల ఒత్తిడి తగ్గించడమే కాకుండా కొత్త కవులకు వేదిక కల్పిస్తున్నాయని ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు కె.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. యానానికి చెందిన ప్రముఖ కవి, కళారత్న డాక్టర్‌ శిఖామణి సంపాదకత్వంలో వెలుడుతున్న కవిసంధ్య కవిత్వ పత్రిక 25వ సంచికను ఆదివారం సాయంత్రం జూమ్‌ యాప్‌ ద్వారా పలువురు సాహితీవేత్తల సమక్షంలో ఆవిష్కరించారు. సమావేశాన్ని ప్రారంభించిన శ్రీనివాస్‌ మా ట్లాడుతూ నిన్న, మొన్న బయల్దేరినట్టు అనిపించిన కవిసంధ్య 25 సంచి కలు పూర్తి చేసుకోవడంలో శిఖామణి పట్టుదల, నిబద్ధత కనిపిస్తున్నాయన్నారు.


కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సరస్వతీ సమ్మాన్‌ కె.శివారెడ్డి కవిసంధ్య రజతోత్సవ సంచికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు కవిత్వానికి ఒక శిఖామణి, దాట్ల దేవదానంరాజు, బొల్లోజుబాబా, సీహెచ్‌ రామ్‌ వంటి కవులను యానాం అందించిందన్నారు. అనంతరం ప్రముఖ రచయిత దాట్ల దేవదానంరాజు, శిఖామణి మాట్లాడారు. యువ కవులు అనికడానీ, పుప్పాల శ్రీరాం, పాళెం చంద్రశేఖరరెడ్డి, పాపినేని శివశంకర్‌, శ్రీనివాసాచర్య, కొప్పర్తి, మధునాపంతుల, కుప్పిలి పద్మ, సీతారాం, వినోదిని పాల్గొన్నారు.

Updated Date - 2020-07-14T11:27:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising