ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తూర్పు’ బంగారం

ABN, First Publish Date - 2020-06-18T10:18:17+05:30

2019 ఏప్రిల్‌ 1 నుంచి 2020 మార్చి 31వరకు వివిధ రంగాల వారీగా జిల్లా ఆర్థిక, సామాజిక సర్వే వివరాలను బడ్జెట్‌ సమావేశాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2019-20 ఆర్థిక సంవత్సర సామాజిక ఆర్థిక సర్వే విడుదల 

జీవన ప్రమాణాలు, వ్యక్తిగత ఆదాయం, పౌలీ్ట్ర రంగాల్లో ‘తూర్పు’ జోరు

జిల్లాలో మొబైల్‌ఫోన్‌ కనెక్షన్లు 8.70 లక్షలు, ఫోన్‌ కనెక్షన్లు 52 వేలు

అన్ని బ్యాంకుల బ్రాంచిల్లో జనం డిపాజిట్లు రూ.32,540కోట్లు 

గొర్రెలు 3.16 లక్షలు, మేకలు 3.18 లక్షలు, 2.80 కోట్ల కోళ్లతో ప్రథమ స్థానం

పాల ఉత్పత్తి 1298 మె.టన్నులు,  మాంసం ఉత్పత్తి 76.40 టన్నులు

ప్రయాణికుల రద్దీలో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు రెండోస్థానం

కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు నుంచి ప్రభుత్వానికి గతేడాది రూ.117 కోట్ల ఆదాయం

జిల్లాలో భూయజమాని రైతులు 3.87 లక్షలు, కౌలు రైతులు 27,168

ప్రభుత్వానికి జిల్లా నుంచి గనుల వార్షిక ఆదాయం రూ.575 కోట్లు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2020 మార్చి 31వరకు వివిధ రంగాల వారీగా జిల్లా ఆర్థిక, సామాజిక సర్వే వివరాలను బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ రంగానికి వచ్చేసరికి జిల్లాలో 1.18 లక్షల హెక్టార్లలో 6.49 లక్షల మంది మార్జినల్‌ రైతులు, మధ్యతరహా రైతులు 44వేల హెక్టార్లు, పెద్ద రైతులు 15 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నట్టు గణాంకాలు వెల్లడించాయి. అటు జిల్లాలో కాలువల ద్వారా 3.17 లక్షల హెక్టార్లు, చెరువుల ద్వారా 21వేల హెక్టార్లు, బావుల ద్వారా 27వేల హెక్టార్లు మొత్తం కలిపి 4.80 లక్షల హెక్టార్ల భూమి సాగవుతు న్నట్టు వెల్లడించింది.


ప్రాజెక్టు ఇప్పటికే 97.34 శాతం పూర్తికాగా, వచ్చే ఏడాది పూర్తి చేస్తామని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. పోలవరం ప్రాజెక్టును 2021కి, పోలవరం ప్రాజెక్టు ఎక్స్‌క్లూడింగ్‌ పవర్‌ హౌస్‌ను 2022కి, ఏలేరు డెల్టా సిస్ఠం ఆధునికీరణను 2023కి, గోదావరి డెల్టా సిస్టం ఆధునికీకరణను 2023కి పూర్తి చేయడానికి కంకణం కట్టుకు న్నట్టు వెల్లడించింది. జిల్లాలో 3,87,189 మంది భూయజమాన రైతులుం డగా, కౌలు రైతులు .27,168 మంది ఉన్నారని తేల్చింది. కొబ్బరి 14,599 హెక్టార్లలో సాగవుతోంది. జిల్లాలో మెత్తం పశుసంపవద 3.96 కోట్లుగా నమోదైంది. గేదెలు 5,85,246 లక్షలు, గొర్రెలు 3,16,480, మేకలు 3,18, 696, పందులు 18,646 ఉన్నాయి. పౌలీ్ట్రల్లో కోళ్ల సంఖ్య 2.80 కోట్లుగా ఉంది. ఇందులో జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో ఉంది. పాడి పరిశ్రమ విభాగంలో జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో పాల ఉత్పత్తి 1298 మెట్రిక్‌ టన్నులు కాగా, మాంసం 76.40 మె.టన్నులుగా నమోదైంది. 


బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ కనెక్షన్లు 8.70 లక్షలు..

జిల్లాలో మొత్తం 924 పోస్టాఫీసులున్నాయి. అన్ని టెలికం సంస్థలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా ఫోన్‌ కనెక్షన్లు పట్టణ ప్రాంతాల్లో 33,463, గ్రామీణ ప్రాంతాల్లో 19,270 వెరసి 52,732 కనెక్షన్లు ఉన్నాయి. సెల్‌ఫోన్‌ కనెక్షన్లు 8,70,239గా నమోదయ్యాయి. బ్యాంకింగ్‌ రంగం విషయానికి వస్తే జిల్లాలో అన్ని బ్యాంకుల బ్రాంచ్‌లు 822 ఉండగా, ఇందులో ఈ ఏడాది మార్చి 31 వరకు ప్రజలు డిపాజిట్లుగా దాచిన డబ్బు రూ.32,540 కోట్లు. బ్యాంకుల నుంచి ప్రజలు, వ్యాపారవర్గాలు తీసుకున్న రుణాలు రూ.41,574 కోట్లుగా లెక్కలు తేలాయి. జిల్లా వ్యాప్తంగా దీపం కనెక్షన్లు 7,17,552 ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 27,625 ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ సెస్‌ల రూపంలో ఖజానాకు జిల్లా నుంచి రూ.95.34 కోట్లు, గనుల ఆదాయం రూ.575 కోట్లు జమ అయ్యాయి. 


డీప్‌వాటర్‌పోర్టు లీజు కథేంటో....

కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి మూడు బెర్త్‌లు న్నాయి. రూ.293 కోట్లతో నిర్మించిన దీన్ని 20 ఏళ్లపాటు కేఎస్‌పీఎల్‌కు ప్రభుత్వం 1999లో నిర్వహణ హక్కులు బదలాయించింది. ఆదాయంలో 22 శాతం రెవెన్యూ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్స రానికి రూ.534 కోట్ల రెవెన్యూ సమకూరగా, ప్రభుత్వానికి వాటా ఆదా యం కింద రూ.117.48 కోట్లు జమ చేసిందని వివరించింది. యాంకరేజ్‌ పోర్టు ఏడాదికి 4 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కార్గో హ్యాండిల్‌ చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో దీని ద్వారా రూ.32.24 కోట్ల రెవెన్యూ ప్రభు త్వానికి వచ్చింది. కాకినాడ ఎస్‌ఈజెడ్‌ పోర్టుకు 2018లో ఒప్పందం జరగ్గా దీని నిర్మాణం జరిగితే సర్కార్‌కు .2.7 శాతం రెవెన్యూషేర్‌ 30 ఏళ్లపాటు వస్తుందని సర్వేలో పేర్కొంది. 


పర్యాటకరంగంలో.. 

రాజమహేంద్రవరం హబ్‌ కింద కోనసీమతోపాటు ఉభయగోదావరి జిల్లాలు అద్భుతంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నట్టు సర్వే పేర్కొంది. అటు రాజమహేంద్రవరం నుంచి మధురపూడి విమానాశ్రయానికి 33.95 కి.మీ. మేర రూ.31.32 కోట్లతో పనులు జరుగుతున్నాయి. అటు కోరంగి మడ అడవుల కింద 235 చదరపు కి.మీ, ఉభయగోదావరి జిల్లాల్లో పాపికొం డలు 1,012 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నట్టు సర్వేలో ప్రస్తావిం చారు. జిల్లాలో ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్ల కింద 75,916 మంది తమ పేర్లు నమోదుచేసుకున్నారు. కాకినాడ-శ్రీకాకుళం సహజవాయువు గ్యాస్‌ పైపులైన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించింది. రాజమహేం ద్రవరం ఎయిర్‌పోర్టుకు 857 ఎకరాల భూమి ఉందని, దీన్ని రూ.300 కోట్లతో ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే విస్తరించిందని, తద్వారా ఎయిర్‌బస్‌ ఏ320లాంటి విమానాలు ఇక్కడ దిగడానికి అనువైన వాతావరణ ఉందని సర్వేలో వివరించారు. ప్రయాణికుల ట్రాఫిక్‌లో గత ఆర్థిక సంవత్సరంలో రెండో స్థానంలో నిలిచిందని సర్వే తేల్చింది.


Updated Date - 2020-06-18T10:18:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising