ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎలుకలను సామూహికంగా నివారించండి’

ABN, First Publish Date - 2020-09-29T18:01:45+05:30

చేలల్లో ఎలుకలను సామూహికంగా నివారించుకుని ది గుబడులను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తపల్లి(తూర్పు గోదావరి): చేలల్లో ఎలుకలను సామూహికంగా నివారించుకుని ది గుబడులను సాధించాలని మండల వ్యవసాయాఽధికారి సత్యనారాయణ విజ్ఞప్తి చేశా రు. రైతు భరోసా కేంద్రంలో సోమవారం నిర్వహించిన సామూహిక ఎలుకల నివారణ క్రమంలో ఆయన సూచనలు చేశారు. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి దొరబాబు వ్యవసాయశాఖ ద్వారా అందించే ఉచిత ఎలుకల మందును పంపిణీ చేశారు. సానా నాగు, గణేశుల నాగేశ్వరరావు, రాపర్తి సూరిబాబు, కొప్పిశెట్టి నాగేశ్వరరావు, పోలినాటి జోయల్‌ పాల్గొన్నారు.


పిఠాపురం రూరల్‌: రైతులంతా ఒకే సమయంలో ఎలుకల నిర్మూలన చేపట్టడంవల్ల ప్రయోజనం ఉంటుందని మండల వ్యవసాయాధికారి అచ్యుతరామయ్య తెలిపారు. పిఠాపురం మండలంలోని 25 రైతుభరోసా కేంద్రాల్లో సోమవారం సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాలు చేపట్టారు. మందు ఎలా కలపాలి, వినియోగించాలో వివరించారు.


గండేపల్లి: మండలంలోని మల్లేపల్లి, తాళ్లూరు గ్రామాల్లో మండల వ్యవసాయశాఖ అధికారి కె.విశ్వనాథ్‌ ఆధ్వర్యంలో సామూహిక ఎలుకల నివారణపై సోమవారం అవగాహన కల్పించారు. దీనికి ముఖ్యఅతిథులుగా వ్యవసాయశాఖ అధికారి నాగకుమార్‌ హాజరయ్యారు.


పెద్దాపురం: రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రోత్సాహాన్ని అందిస్తోందని పెద్దాపురం వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు అన్నారు. మండలంలోని కట్టమూరు రైతుభరోసా కేంద్రంవద్ద వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన సామూహిక ఎలుకల నివారణా మందు పంపిణీలో సోమవారం ఆయన మాట్లాడారు. సామూహిక ఎలుకల నివారణా మందు తయారుని రైతులకు వివరించారు. ఏవో ప్రశాంతి, పీఏసీఎస్‌ అధ్యక్షురాలు రంగనాథం రమాదేవి శ్రీనివాస్‌, మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడు చల్లా చినవీర్రాజు, జీను వెంకటరమణ, నల్లల గోవిందు, పెంట విజయ్‌కుమార్‌, పడాల చంటిబాబు పాల్గొన్నారు.


జగ్గంపేట రూరల్‌: మండలంలోని రైతుభరోసా కేంద్రాల్లో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టారు. రామవరం, జగ్గంపేట రైతుభరోసా కేంద్రాలవద్ద ఏర్పాటు చేసిన సదస్సులో జగ్గంపేట ఏడీఏ బండారు నాగకుమార్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల ఏవో రెడ్ల శ్రీరామ్‌, గ్రామ వీఐఏలు, రైతులు వలంటీర్లు పాల్గొన్నారు.


Updated Date - 2020-09-29T18:01:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising