ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ అవ్వ గట్టిదే

ABN, First Publish Date - 2020-09-25T00:32:02+05:30

ఆ అవ్వ గట్టిదే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పుగోదావరి జిల్లాలో  శ‌తాధిక వృద్ధురాలు కోవిడ్‌ను జ‌యించింది.. కాకినాడ జీజీహెచ్ నుంచి ఈమె గురువారం డిశ్చార్జ్ అయ్యారు..127 ఏళ్ల క‌న్నార‌పు వీర రాఘ‌వ‌మ్మ‌ కొవిడ్ తో ఆగ‌స్టు 31న కాకినాడ జీజీహెచ్ లో చేరారు..కిర్లంపూడి మండ‌లం జ‌గ‌ప‌తి న‌గ‌రానికి చెందిన రాఘ‌వ‌మ్మ 1893లో జన్మించగా జ్వరంతో ఆసుపత్రిలో చేర్చారు...కాగా ఆమెకు నయం కావడంతో డిశ్చార్జ్ చేశారు..కాకినాడ ప్ర‌భుత్వ సామాన్య ఆసుప‌త్రి (జీజీహెచ్‌) వైద్యులు అరుదైన ఘ‌న‌త సాధించారు. క‌రోనా సోకిన 127 ఏళ్ల వృద్ధురాలికి మెరుగైన చికిత్స అందించి, ఆమె కోలుకునేలా చేశారు. వృద్ధులకు క‌రోనా సోకితే బ‌య‌ట‌ప‌డ‌టం క‌ష్ట‌మ‌ని భావిస్తున్నప‌రిస్థితుల్లో ఏకంగా 127 ఏళ్ల వృద్ధురాలు కోలుకోవ‌డం వెనుక ఆసుప‌త్రి సిబ్బంది కృషి ఉంద‌ని జీజీహెచ్ సూప‌రింటెండెంట్ ఎం.రాఘ‌వేంద్ర‌రావు తెలిపారు. ఆగ‌స్టు 31న క‌న్నార‌పు వీర రాఘ‌వ‌మ్మ ఆసుప‌త్రిలో చేరార‌ని, గురువారం డిశ్చార్జ్ అయ్యార‌ని చెప్పారు. క‌రోనా వ‌స్తే భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, అపోహ‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి, ధైర్యంగా చికిత్స తీసుకుంటే ఎవ‌రైనా వ్యాధిని జ‌యించ‌వ‌చ్చ‌ని ఈ ఘ‌ట‌న  నిరూపిస్తోంద‌ న్నారు. 


న‌మ్మ‌లేక‌పోతున్నాం: ‌కుటుంబ స‌భ్యులు

కిర్లంపూడి మండ‌లం జ‌గ‌ప‌తిన‌గ‌రానికి చెందిన రాఘ‌వ‌మ్మ 1893లో జ‌న్మించిన‌ట్లు ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆసుప‌త్రిలో చేర్చిన‌ప్పుడు ఆమె కోలుకుంటార‌ని అనుకోలేద‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌న్నారు. వృద్ధుల‌కు క‌రోనా వ‌స్తే కోలుకోవ‌డం క‌ష్ట‌మ‌ని బ‌య‌ట అనుకోవ‌డం విన్నాన‌ని..కానీ  ఈ రోజు ఆమె కోలుకొని చ‌లాకీగా తిరుగుతున్న‌ట్లు చెప్పారు.

Updated Date - 2020-09-25T00:32:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising