డాక్టర్ కర్రి రామారెడ్డికి మరో పురస్కారం
ABN, First Publish Date - 2020-12-01T07:01:27+05:30
సరస్వతీ పుత్రుడు, నిత్యవిద్యార్థి ప్రముఖ మానసిక వైద్యుడు కర్రి రామారెడ్డి ఖాతాలో మరో పురస్కారానికి చోటుదక్కింది.
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 30: సరస్వతీ పుత్రుడు, నిత్యవిద్యార్థి ప్రముఖ మానసిక వైద్యుడు కర్రి రామారెడ్డి ఖాతాలో మరో పురస్కారానికి చోటుదక్కింది. ఇప్పటికే అనేక అవార్డులు, డాక్టరేట్‌లు, డిగ్రీలతో ఆయన ఒక చరిత్ర సృష్టించారు. ఇప్పు డు తాజాగా 2020 ఏడాదికి గాను తెలంగాణ రాష్ట్రం ఖమ్మం సైకియాట్రిక్ సొసైటీ వారిచే డాక్టర్ భుజంగరావు స్మారక ప్రసంగ పురస్కారానికి కర్రి రామారెడ్డిని ఎంపికి చేశారు. ఆదివారం రాత్రి ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో జూమ్ యాప్ ద్వారా మానసిక వైద్యంలో యోగచికిత్స శాస్త్రీయత పై రామారెడ్డి వివరించడం, ఆధునిక మానసిక వైద్యంలో యోగశాస్త్రాన్ని ఏవిధంగా సమన్వయం చేసుకోవచ్చో వివరించారు. దీంతో డాక్టర్ కర్రి రామారెడ్డిని పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ మేరకు సోమవారం ఈ పురస్కారాన్ని అందించారు. ముఖ్యఅతిఽథులుగా దక్షిణభారత సైకియాట్రిష్టుల సంఘం మాజీ అధ్యక్షుడు డాక్టర్ కిషన్, డాక్టర్ నసీరాబాది, తెలంగాణ ప్రైవేట్ సైకియాట్రిస్టులు సంఘం అధ్యక్షుడు జార్జిరెడ్డి, డాక్టర్ భాగ్యరెడ్డి, డాక్టర్ శోభాదేవిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్, డాక్టర్ ప్రమోద్, డాక్టర్ రఘురాం 100 మంది మానసిక వైద్యులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-01T07:01:27+05:30 IST