ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సచివాలయాన్ని తరలించొద్దు’

ABN, First Publish Date - 2020-07-09T09:47:47+05:30

మండంలోని కట్టమూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్న సచివాలయం-2ను తరలించవద్దంటూ ఆప్రాంత వాసులు బుధవారం ఆందోళనకు దిగారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పెద్దాపురం, జూలై 8 : మండంలోని కట్టమూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్న సచివాలయం-2ను తరలించవద్దంటూ ఆప్రాంత వాసులు బుధవారం ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన రేగెళ్ల దాసు, ఉప్పిటి సింగ్‌బాబు, ఆధ్వర్యంలో సచివాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అలాగే సచివాలయ సిబ్బందిని లోపలికి వెళ్లకుండా సచివాలయానికి తాళం వేశారు.


దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, తహసీల్దార్‌ బూసి శ్రీదేవి అక్కడకు చేరుకుని ఆప్రాంతవాసులతో మాట్లాడారు. అలాగే వారు సూచించిన ప్రాంతంలో సచివాలయ నిర్మాణానికి సంబంధించి సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందుల లేకుండా ఉంటే ఆప్రాంతంలోనే సచివాలయాన్ని నిర్మించే విధంగా చర్యలు తీసుఉంటామని, అలాగే ఇంజనీరింగ్‌ అధికారులతో చర్చించి ఈసమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. దీంతో ఆ ప్రాంతవాసులు శాంతించారు. 

Updated Date - 2020-07-09T09:47:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising