ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివీస్‌ను ఆపాలని దీక్షలు

ABN, First Publish Date - 2020-12-03T05:44:00+05:30

తొండంగి మండలంలో దివీస్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొండంగి, డిసెంబరు 2: తొండంగి మండలంలో దివీస్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. కొత్తపాకల గ్రామంలో పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షా శిబిరం ప్రారంభించారు.   శిబిరాన్ని ఉద్దేశించి సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకుడు దువ్వా శేషు బాబ్జి మాట్లాడుతూ గతంలో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తామంతా పోరాటం చేశామన్నారు. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుతం సీఎం జగన్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోను జరగనివ్వబోమని హామీ ఇచ్చారన్నారు. ఆయనే ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు రానున్నట్టు తెలుస్తోందని, ఇది రైతులను మోసగించడమేనన్నారు. రైతులు, మత్య్పకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల పక్షాన తాము పోరాటం సాగిస్తామని వారు తెలిపారు. శిబిరంలో దండు ముసలయ్య, అరుణ్‌ కుమార్‌, కాశీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-03T05:44:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising