ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో స్ట్రెయిన్‌ కేసులు 5

ABN, First Publish Date - 2020-12-30T07:17:23+05:30

కొత్త వైరస్‌ యూకే స్ర్టెయిన్‌ జిల్లాలో ప్రవేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూకే నుంచి  వచ్చిన ఇద్దరికి.. ముగ్గురు కాంటాక్టులకు పాజిటివ్‌

కాకినాడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కొత్త వైరస్‌ యూకే స్ర్టెయిన్‌ జిల్లాలో ప్రవేశించింది. ఈ విషయాన్ని స్వయంగా డీఎంహెచ్‌వో డాక్టర్‌ కేవీఎస్‌ గౌరేశ్వరరావు వెల్లడించారు. ఇటీవల యూకే నుంచి వచ్చిన రాజమహేంద్రవరం అర్బన్‌ మండలం రామకృష్ణనగర్‌కు చెందిన ఆంగ్లో ఇండియన్‌ మహిళకు ఈ వైరస్‌ సోకినట్టు నిర్ధారణయ్యిందన్నారు. కానీ ఈమెకు ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న కుమారుడికి నెగిటివ్‌ వచ్చిందన్నారు. అలాగే యూకే నుంచి వచ్చిన కాకినాడ వెంకట్‌ నగర్‌కు చెందిన ఓ యువకుడికి పరీక్ష చేయగా పాజిటివ్‌ వచ్చిందన్నారు. అలాగే ఇతని ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులకు పరీక్ష చేయగా మరో ముగ్గురికి పాజిటివ్‌ సోకిందన్నారు. తుది పరీక్షల నిమిత్తం కోసం హైదరాబాద్‌ సీసీఎం ల్యాబ్‌కు పం పామన్నారు. ప్రస్తుతం అనుమానితుల్లో మరో ముగ్గురిని గుర్తించాల్సి ఉంద న్నారు. మొత్తం అయిదుగురు పాజిటివ్‌ వ్యక్తుల ప్రైమరీ కాంట్రాక్ట్‌గా వెయ్యి మందికి పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు యూకే నుంచి జిల్లాకు 114 మంది వచ్చారని, వీరిలో 111 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశామన్నారు. 




Updated Date - 2020-12-30T07:17:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising