ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజమహేంద్రవరం అభివృద్ధికి వెయ్యి కోట్లు అడిగాం

ABN, First Publish Date - 2020-12-03T05:56:14+05:30

రాజమహేంద్రవరం నగరాభివృద్ధికి వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎం జగన అడిగామని స్థానిక ఎంపీ భరత్‌రామ్‌ తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ భరత్‌రామ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎంపీ భరత్‌రామ్‌

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 2: రాజమహేంద్రవరం నగరాభివృద్ధికి వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎం జగన అడిగామని స్థానిక ఎంపీ భరత్‌రామ్‌ తెలిపారు. బుధవారం రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు. ఎంఆర్‌సీడీ పథకంలో రూ.416 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామన్నారు. పూర్తి రా వాటర్‌ను శుద్ధిచేసి ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందిస్తామన్నారు. గామన్‌ రోడ్డు నిర్వాకం టీడీపీదేనని, ఇప్పుడు ఆ రోడ్డు నిర్మాణం జరుగుతోందన్నారు. జంక్షన్ల అభివృద్ధి, రైల్వేస్టేషన్‌ రోడ్డు విస్తరణ, దివాన్‌చెరువు-రాజానగరం 10 కిలోమీటర్ల మేర అవుటర్‌ రింగ్‌ రోడ్డు, పుష్కరాల రేవును ఆధునికీకరించడం, నన్నయ్య యూనివర్శిటి గాని ఆర్స్ట్‌ కాలేజి గ్రౌండ్‌లో గాని క్రికెట్‌ స్టేడియం నిర్మాణంతో నగరాన్ని స్పోర్ట్సు హబ్‌గా మార్చడం, విశాఖపట్నం-రాజమహేంద్రవరం-విజయవాడ మధ్య షీ ప్లేయిన్‌లు నడపడం, హేవ్‌లాక్‌ బ్రిడ్జి, పిచ్చుక లంకలో పీపీపీ మోడ్‌లో రిసార్ట్స్‌ ఏర్పాటు తదితర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని ఎంపీ భరత తెలిపారు. సీఎం జగన్‌ కూడా సానుకూలంగా ఉన్నారన్నారు. ఇళ్ల నిర్మాణాలపై మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షలు ఇళ్ల నిర్మాణాలకు సీఎం శ్రీకారం చుట్టారని, తొలుతగా 15 లక్షల నిర్మాణాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఇళ్ల స్కీమ్‌లో చంద్రబాబుకు తమ నాయకుడు జగన్‌ స్కీముకు చాలా తేడా ఉందన్నారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడం చంద్రబాబు స్కీమ్‌. అయితే రూ.9 లక్షలతో రూపొందిస్తే సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.7.50 లక్షలను 20ఏళ్లలో లబ్ధిదారుడు తీర్చేవిధంగా రూపకల్పన చేస్తే జగన మాత్రం కేవలం రూపాయి ప్రొఫైౖల్‌తో ఇల్లు ఇస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ చేసిన దోపిడీని బయట పెడతారని, బాధితులకు న్యాయం చేసేందుకు సీఎం జగన ప్రధాని మోదీని కలుస్తారని ఎంపీ చెప్పారు. సమావేశంలో గాండ్ల తెలుకుల కార్పొరేషన్‌ చైర్మన్‌ భవానిప్రియా, ద్వారకా తిరుమల ట్రస్ట్‌ కమిటీ సభ్యురాలు కొత్త విజయరాజ్యలక్ష్మి, జిల్లా అధికార పత్రినిధి కేసీ సాగర్‌, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మి, వడ్డీ మురళీ, మాజీ కార్పొరేటర్‌ మజ్జి నూకరత్నం పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:56:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising