ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిసెంబరు 30 నాటికి పంట నష్టపరిహారం

ABN, First Publish Date - 2020-11-29T06:51:45+05:30

నివర్‌ తుఫాను కారణంగా నష్టపోయిన పంటలకు డిసెంబరు 30వ తేదీనాటికి నష్టపరిహారం అందిం చేలా సత్వర చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, సహకార మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నష్టపోయిన పంటల  వివరాలు డిసెంబరు 10వ తేదీలోగా అందించాలి

 టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి కన్నబాబు ఆదేశం


సర్పవరం జంక్షన్‌, నవంబరు 28: నివర్‌ తుఫాను కారణంగా నష్టపోయిన పంటలకు డిసెంబరు 30వ తేదీనాటికి నష్టపరిహారం అందిం చేలా సత్వర చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, సహకార మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. శనివారం కాకినాడ వైద్యనగర్‌లోని క్యాంపు కార్యాలయం నుంచి వ్యవసాయ, మార్కెటింగ్‌, విత్తనాభివృద్ధి, సివిల్‌ సప్లయ్‌ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పంట నష్టం వివరాల జాబితాలను డిసెంబరు 10వ తేదీలోపు సిద్ధం చేయాలని ఆదేశించారు. నివర్‌ తుఫాను కారణంగా పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో విత్తన రాయితీపై అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఉభయగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నందున రబీలో వరిసాగు కోసం మార్చి 30 నాటి వరకు పంట కాలువలకు నీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ మేరకు అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌, హార్టికల్చర్‌ కమిషనర్‌ చిరంజీవిచౌదరి, మార్కెటింగ్‌ కమిషనర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న, ఏపీ సీడ్స్‌ ఎండీ జి. శేఖర్‌బాబు, సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ కోన శశిధర్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2020-11-29T06:51:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising