వాడపల్లి వెంకన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
ABN, First Publish Date - 2020-03-08T09:12:42+05:30
వాడపల్లి వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ సేవలు ద్వారా
ఆత్రేయపురం, మార్చి 7: వాడపల్లి వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ సేవలు ద్వారా రూ. 20,600, దర్శనం టిక్కెట్ల ద్వారా రూ. 6,13,275, లడ్డూ ప్రసాదాల ద్వారా రూ. 2,40,750, అన్నప్రసాద ట్రస్టుకు రూ. 1,76,738 కలిపి మొత్తం ఒక్కరోజు రూ. 10,51,914 ఆదాయం లభించింది. 13,678 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారు. చైర్మన్ రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
Updated Date - 2020-03-08T09:12:42+05:30 IST