ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికార యంత్రాంగం కృషి భేష్‌

ABN, First Publish Date - 2020-10-31T06:20:01+05:30

కొవిడ్‌-19 నియంత్రణలో జిల్లా అధికార యంత్రాంగం విశేషంగా కృషి చేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.

వారియర్స్‌ను సత్కరిస్తున్న మంత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  మంత్రి వేణుగోపాలకృష్ణ
డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు 30: కొవిడ్‌-19 నియంత్రణలో జిల్లా అధికార యంత్రాంగం విశేషంగా కృషి చేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. వైద్య, పోలీస్‌, సచివాలయ శాఖలకు చెందిన కరోనా వారియర్స్‌ను శుక్రవారం సత్కరించారు. కలెక్టరేట్‌ విఽధాన గౌతమీ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వేణగోపాలకృష్ణ మాట్లాడుతూ  కొవిడ్‌ నియంత్రణలో జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు. కొవిడ్‌పై అలక్ష్యం వహిస్తే మళ్లీ వచ్చే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని అధికారులకు సహకరించాలన్నారు. కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21 నుంచి ఇప్పటి వరకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. జాయింట్‌ కలెక్టర్లు చేకూరి కీర్తి, జి.రాజకుమారి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, అదనపు ఎస్పీ కరణం కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కేవీఎస్‌ గౌరీశ్వరరావు, రాజమహేంద్రవరం డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రమేష్‌కిశోర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T06:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising