ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫంక్షన్‌ హాల్‌లో కొవిడ్‌ ఆసుపత్రి

ABN, First Publish Date - 2020-09-23T07:28:44+05:30

కరోనా పేరుతో కొందరు వైద్యులు బాధితుల నుంచి లక్షలు దోపిడీ చేస్తున్నారు. కొందరు ప్రాణాలు పోస్తుంటే కొందరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ

 డీఎంహెచ్‌వో అనుమతి ఇచ్చినట్టు కథనం

సబ్‌ కలెక్టర్‌ ఆదేశాలతో తనిఖీ.. సీజ్‌కు రెడీ


రాజమహేంద్రవరం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కరోనా పేరుతో కొందరు వైద్యులు బాధితుల నుంచి లక్షలు దోపిడీ చేస్తున్నారు. కొందరు ప్రాణాలు పోస్తుంటే కొందరు కేవలం దోపిడీ లక్ష్యంగా పని చేస్తున్నారు. నగరంలోని జేఎన్‌ రోడ్డులో ఉన్న సూర్య ఫంక్షన్‌ హాలులో నిడదవోలుకు చెం దిన డాక్టర్‌ వారం నుంచి కొవిడ్‌ ఆసుప్రతి నిర్వహిస్తున్నారు. దీనికి కాకినాడ డీఎంహెచ్‌వో అనుమతి ఇచ్చినట్టు సమా చారం. ఇది విరుద్ధం. ఇక్కడ సదరు డాక్టర్‌ ఒక్కో రోగి నుంచి రూ.3 లక్షలు వసూలు చేస్తున్నట్టు అధికారుల కథనం. దీనిపై ఫిర్యాదు రావడంతో సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి అర్బన్‌ తహశీల్దార్‌, పోలీసులు సోదా చేశారు.


ఏడుగురు పేషెంట్లు ఉన్నారు. కేవలం హాలులో డేరా వేసి, బెడ్స్‌ ఏర్పాటుచేసి కొవిడ్‌ ఆసుపత్రి నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. సబ్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు సీజ్‌ చేయనున్నట్టు ఓ అధికారి తెలిపారు. తక్షణం సీజ్‌ చేస్తే పేషెంట్లను ఎక్కడ చేర్చాలనే ఆలోచనతో అక్కడి కేస్‌ సీట్లు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-09-23T07:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising