ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కలకలం

ABN, First Publish Date - 2020-03-16T09:08:55+05:30

రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామంలో ఆదివారం కరోనా కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఒక యువకుడికి కరోనా లక్షణాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండగుంటూరులో..

అబూదబీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా అనుమానం


దివాన్‌చెరువు, మార్చి 15:

రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామంలో ఆదివారం కరోనా కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఒక యువకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన వైద్యఆరోగ్యశాఖ కొండగుంటూరులో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పెద్దసంఖ్యలో తమ గ్రామానికి తరలివచ్చిన వైద్యసిబ్బందిని చూసి గ్రామస్థులు కలవరపాటుకు లోనయ్యారు. దీనికి సంబంధించి రాజానగరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ టి.రవికుమార్‌ తెలిపిన వివరాలివి.


అబూదబీనుంచి స్వగ్రామమైన కొండగుంటూరుకు ఈనెల 3న వచ్చిన యువకుడికి ఈనెల 11 నుంచి జలుబు, దగ్గు రావడంతో 12న కాకినాడలోని జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి వైద్యపరీక్షలు చేస్తున్నామన్నారు. యువకుడి కుటుంబసభ్యులు ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. కొండగుంటూరులోని యువకుడి ఇంటి మొత్తానికి ఐసోక్లొరీ సొల్యూషన్‌ చేశామని, పరిసరాల్లోని అన్ని వీధులతో బ్లీచింగ్‌ చల్లించామన్నారు. కేశవరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ శ్రీవల్లీ పాల్గొన్నారు.

Updated Date - 2020-03-16T09:08:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising