ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి

ABN, First Publish Date - 2020-09-24T07:52:13+05:30

గ్రామ సచి వాలయాలకు వచ్చే వివిధ సేవలకు సంబంధించిన ఫిర్యా దులను ఆయా శాఖల సిబ్బంది సకాలంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): గ్రామ సచివాలయాలకు వచ్చే వివిధ సేవలకు సంబంధించిన ఫిర్యా దులను ఆయా శాఖల సిబ్బంది సకాలంలో పరిష్కరించాలని అమలాపురం సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ ఆదేశించారు. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు విధులు, సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అమలా పురం డివిజన్‌లోని అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీ వోలు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్లు, వీ ఆర్వోలతో బుధవారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్పందనలో అందే ఫిర్యాదులతో పాటు అన్నిరకాల సేవలకు సంబంధించి ఎక్కడా పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు.


ఎక్కడైనా సాం కేతిక సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచిం చారు. గురు వారం నుంచి మూడు రోజులపాటు గ్రామ సచి వాలయాల్లో పనిచేస్తున్న అన్ని శాఖల సిబ్బంది నైపుణ్యా లను పెంపొందించే శిక్షణా కార్యక్రమం నిర్వహిం చడం జరుగుతుందన్నారు. కార్యక్ర మంలో ఏఎస్‌వో జె.ఆనందబాబు, వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు ఎంఏ.షంషీ, అన్ని గ్రామ సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T07:52:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising