ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విడుదలైన ఖైదీలకు పునరావాసం కల్పించాలి

ABN, First Publish Date - 2020-11-22T05:26:38+05:30

జిల్లాలో విడుదలైన ఖైదీలకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌  మురళీధర్‌రెడ్డి 

 డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), నవంబరు 21: జిల్లాలో విడుదలైన ఖైదీలకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి శనివారం జిల్లా స్థాయి ప్రొబేషన్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశాన్ని జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రొబేషన్‌ అధికారి వద్ద పరిశీలనలో ఉన్న 61 కేసులలో 41 మంది సత్ప్రవర్తన కలిగిన మాజీ ఖైదీలు, 20 మంది పీవో యాక్ట్‌ కింద పర్యవేక్షితులుగాను ఉన్నారన్నారు. వారికి పునరావాసం కల్పించడంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కార్పొరేషన్ల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్ల ద్వారా వారి ప్రవర్తనను పరిశీలిస్తూ వారికి కల్పిస్తున్న పునరావాసాలపై మూడు వారాల్లోగా నివేదికలు సమర్పించడంతో పాటు తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. జిల్లా రెవెన్యూ అఽధికారి సీహెచ్‌ సత్తిబాబు, జిల్లా ప్రొబేషన్‌ అధికారి ఎం.శరత్‌, ఎస్సీ, బీసీ, కార్పొరేషన్‌ ఈడీలు జీఎస్‌ సునీత, ఎస్‌వీఎస్‌ సుబ్బలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ హరిహరనాథ్‌, డీఈవో ఎస్‌.అబ్రహాం, ఎల్‌డీఎం షణ్ముఖరావు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-22T05:26:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising