ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వాసుపత్రుల్లో కొవిడ్‌ నివారణకు మెరుగైన వైద్యం

ABN, First Publish Date - 2020-08-11T10:55:57+05:30

ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా వైరస్‌ నివారణకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి 

కొత్తపేట ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్‌ సెంటర్‌ ప్రారంభం


కొత్తపేట, ఆగస్టు 10: ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా వైరస్‌ నివారణకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అన్నారు. సోమవారం కొత్తపేట ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో 20పడకల కొవిడ్‌ సెంటర్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈసెంటర్‌లో మందులు, ఏర్పాట్లను ఆయన పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మూడు ఏరియా ఆసుపత్రులు, నాలుగు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో కొవిడ్‌సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.


పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కనీసం ఐదు పడకలతో కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ కరోనా బాధితులకు తక్షణం వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ గొల్లపల్లి డేవిడ్‌రాజు, ముత్యాల వీరభద్రరావు, మార్గాని గంగాధరరావు, ముసునూరి వెంకటేశ్వరరావు, ఆర్డీవో ఎన్‌.వసంతరాయుడు, డీఎస్పీ షేక్‌ మసూంబాషా, తహశీల్దార్‌ జీడీ కిషోర్‌బాబు, డాక్టర్‌ సీహెచ్‌.మధుకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-11T10:55:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising