ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రత్యేక కమిటీ

ABN, First Publish Date - 2020-10-31T06:11:03+05:30

కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి చెప్పారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, గ్రామ, వార్డు సచివాలయ నియామకాలపై కలెక్టరేట్‌ నుంచి జిల్లా, డివిజనల్‌ స్థాయి అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ మాట్లాడారు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు 30: కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి చెప్పారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, గ్రామ, వార్డు సచివాలయ నియామకాలపై  కలెక్టరేట్‌ నుంచి జిల్లా, డివిజనల్‌ స్థాయి అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ మాట్లాడారు, డివిజనల్‌ స్థాయిలో అందుబాటులో ఉన్న భౌతిక, మౌలిక వసతుల వివరాలతో నివేదికలు రూపొందించాలని సూచించారు. కొత్త జిల్లాలకు అవసరమైన తాత్కాలిక, శాశ్వత ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, ఖాళీ స్థలాలు తదితర విషయాలపై కసరత్తు చేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నవంబరు 10లోగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నవంబరు 2న పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, జాయింట్‌ కలెక్టర్లు జి.లక్ష్మీశ, చేకూరి కీర్తి, జి.రాజకుమారి, డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T06:11:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising