ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త చట్టాలతో నిరుపేదలకు బాధ కలగొద్దు: కేసీఆర్

ABN, First Publish Date - 2020-09-25T02:12:55+05:30

కొత్త చట్టాల అమల్లో నిరుపేదలకు బాధ కలగకుండా చూడాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. మున్సిపల్‌ కార్పొరేషన్లలోని ఎమ్మెల్యేలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కొత్త చట్టాల అమల్లో నిరుపేదలకు బాధ కలగకుండా చూడాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. మున్సిపల్‌ కార్పొరేషన్లలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. చట్టాల ఫలితాలు చివరి గుడిసె వరకు అందేలా చూడటమే లక్ష్యమని చెప్పారు. నూతన చట్టాల అమలు కోసం ప్రజా ప్రతినిధులు శ్రమించాలని సూచించారు. నూటికి నూరు శాతం ప్రజలే కేంద్ర బిందువని తెలిపారు. విప్లవాత్మక పాలనా సంస్కరణల్లో భాగంగానే వినూత్న చట్టాలు తీసుకొచ్చినట్లు వివరించారు. చట్టాలను కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులదేనని పేర్కొన్నారు. భూ క్రమబద్దీకరణ పైసలతో ఖజానా నింపుకునే యోచన లేదని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునేలోగా అనేక చర్యలు చేపడతామన్నారు. భూములు, ఆస్తుల సమస్యలకు విధానపరమైన పరిష్కారాలు, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నవాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు చెందిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.

Updated Date - 2020-09-25T02:12:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising