ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యానాంలో విద్యాసంస్థల మూసివేత

ABN, First Publish Date - 2020-03-16T09:13:59+05:30

పుదుచ్చేరి ప్రభుత్వం కరోనా వ్యాప్తిపై ప్రత్యేక చర్యలు తీసుకుంది. పుదుచ్చేరిలోని నాలుగు నియోజకవర్గాల్లో ఐదో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనాపై పుదుచ్చేరి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

16రోజులపాటు పాఠశాలలు, సినిమా హాళ్లకు సెలవు

ఉన్నతాధికారులకు సెలవులు రద్దు


యానాం, మార్చి 15: పుదుచ్చేరి ప్రభుత్వం కరోనా వ్యాప్తిపై ప్రత్యేక చర్యలు తీసుకుంది. పుదుచ్చేరిలోని నాలుగు నియోజకవర్గాల్లో ఐదో తరగతి వరకు పాఠశాల తరగతులకు సెలవులు ప్రకటించారు. సోమవారం నుంచి ఈనెల 31 వరకు యానాం నియోజకవర్గంలోని పాఠశాలలు, సినిమా హాళ్లకు సెలవు ప్రకటిస్తూ యానాం పరిపాలనాధికారి శివరాజ్‌మీనా ఆదేశాలు జారీ చేశారు.


ఈ మేరకు తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కరపత్రాల పంపిణీ తదితర కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. యానాం నియోజకవర్గ పరిధిలోని ఉన్నతాధికారులకు సెలవులు రద్దు చేశారు. అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై శాఖాపరమైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమాల్లో ఆరోగ్యశాఖ డీడీ కాశి సత్యనారాయణ, ఎస్పీ భక్తవత్సలన్‌, విద్యాశాఖధికారి కాలే సాయినాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-03-16T09:13:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising