ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాంసం దుకాణాలన్నీ బంద్.. ఆదివారం అంతా శాకాహారమే..

ABN, First Publish Date - 2020-04-08T20:22:04+05:30

ఈనెల 12 నుంచి ప్రతి ఆదివారం జిల్లా అంతటా మాంసం దుకాణాలు బంద్‌ చేయాలని జేసీ లక్ష్మీశ ఆదేశించారు. కొవిడ్‌ 19 నిర్మూలనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాంసాహార దుకాణాలు బంద్‌

జేసీ లక్ష్మీశ వెల్లడి


కాకినాడ (ఆంధ్రజ్యోతి): ఈనెల 12 నుంచి ప్రతి ఆదివారం జిల్లా అంతటా మాంసం దుకాణాలు బంద్‌ చేయాలని జేసీ లక్ష్మీశ ఆదేశించారు. కొవిడ్‌ 19 నిర్మూలనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కేవలం శాకాహార ఉత్పత్తులే విక్రయించాలని, ఏ రకమైన మాంసాహారం అమ్మకూడదని పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి ప్రతి ఆదివారం జిల్లా వ్యాప్తంగా మాంసాహారం దుకాణాలన్నీ బంద్‌ చేయాలని జేసీ లక్ష్మీశ ఆదేశించారు. మార్కెట్లు పర్యవేక్షిస్తున్న సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్‌-19 నిర్మూలనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆదివారం చికెన్‌, మటన్‌, చేప, రొయ్యల మార్కెట్‌లు కిక్కిరిసిపోతున్నాయన్నారు. అందువల్ల ప్రజలెవరూ భౌతిక దూరం పాటించడం లేదని, దీంతో వైరస్‌ ఉనికి ఎక్కువయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఆదివారం కేవలం కూరగాయల మార్కెట్లు మాత్రమే ఉదయం 6 నుంచి 10గంటల వరకు తెరిచి ఉంటాయన్నారు. ఈ ఆదేశాలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


నాలుగు మాంసం దుకాణాల సీజ్‌

రాజమహేంద్రవరంలో లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించిన నాలుగు మాంసం దుకాణాలు, నాలుగు టీ స్టాల్స్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. త్రీటౌన్‌ పోలీసుల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా మాంసం దుకాణాలు తెరచి వుండటాన్ని గమనించి వాటిని సీజ్‌ చేసి నలుగురిపై కేసులు నమోదు చేసారు. అలాగే టూ టౌన్‌ పోలీసుల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా తెరచిన నాలుగు టీ స్టాల్స్‌ను సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-04-08T20:22:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising