కోడ్ మరిచారా!
ABN, First Publish Date - 2020-03-10T09:15:41+05:30
జిల్లాలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉంది. నిబంధనల ప్రకారం రాజకీయ నాయకుల ఫొటోలకు ముసుగు వేయాలి.
ఆద మరిచారా!
కాకినాడ రూరల్ : జిల్లాలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉంది. నిబంధనల ప్రకారం రాజకీయ నాయకుల ఫొటోలకు ముసుగు వేయాలి. ఫ్లెక్సీలు తొలగించాలి. కానీ కాకినాడలో అధికారులు కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. అధికార పార్టీ నాయకుల ఫొటోలను మినహాయించి మిగిలిన వారి ఫొటోలకు మాత్రమే ముసుగు వేశారు. వైసీపీ నాయకుల ఫ్లెక్సీలను చూసిచూడనట్టే వదిలేశారు. ప్రభుత్వ కార్యాలయాలపై సీఎం, ఇతర నాయకుల ఫొటోలకు ముసుగులు వేయలేదు. దీంతో అధికారులు ఆద మరిచారా అంటూ ఇతర పార్టీ నాయకులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు కోడ్ వర్తించదా అని ప్రశ్నిస్తున్నారు.
Updated Date - 2020-03-10T09:15:41+05:30 IST