వనదుర్గ ఆలయంలో ఘనంగా చండీహోమం
ABN, First Publish Date - 2020-10-03T06:02:58+05:30
రత్నగిరి క్షేత్రరక్షకి వనదుర్గ ఆలయంలో శుక్రవారం చండీహోమం జరిగింది. ఉదయం 9గంటలకు పండితులు గణపతిపూజతో కార్యక్రమం
అన్నవరం, అక్టోబరు 2: రత్నగిరి క్షేత్రరక్షకి వనదుర్గ ఆలయంలో శుక్రవారం చండీహోమం జరిగింది. ఉదయం 9గంటలకు పండితులు గణపతిపూజతో కార్యక్రమం ప్రారంభించారు. అమ్మవారికి చండీసప్తసతి పారాయణ, మూల మంత్ర జపాలు పఠించారు. 11గంటలకు సుగంధ ద్రవ్యాలను హోమగుండంలో అర్పించి పూర్ణాహుతి గావించారు. చతుర్వేద పండితుల వేదాశీర్వచనాలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Updated Date - 2020-10-03T06:02:58+05:30 IST