దాతల సాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు
ABN, First Publish Date - 2020-10-03T07:10:41+05:30
ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి యాళ్ల దొరబాబు అన్నారు. దాతలు
అల్లవరం, అక్టోబరు 2: ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి యాళ్ల దొరబాబు అన్నారు. దాతలు కందాల వెంకటరామారావు, నవుబత్తుల నాగుల ఆర్థిక సాయంతో బెండమూర్లంక భూసమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. యాళ్ల దొరబాబు, ఎస్‌ఐ బి.ప్రభాకరరావు, సినీనటుడు గుర్రం రామకృష్ణారావు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆలయ ధర్మకర్త కంచర్ల శ్రీరామ్మూర్తి, యాళ్ల సతీష్ పాల్గొన్నారు.
Updated Date - 2020-10-03T07:10:41+05:30 IST