కాల్వలోకి దూసుకెళ్లినకారు: ఒకరి మృతి
ABN, First Publish Date - 2020-12-29T06:08:39+05:30
కాల్వలోకి కారు దూసుకెళ్లగా ఒకరు మృతి చెందారు.
మలికిపురం, డిసెంబరు 28: కాల్వలోకి కారు దూసుకెళ్లగా ఒకరు మృతి చెందారు. గుడిమెళ్లంకకు చెందిన నక్కా హరీష్(24), అంతర్వేది పాలానికి చెందిన గుర్రం జాన్‌వెస్లీలు బెలినో కారులో అప్పనరామునిలంక పెళ్లికి వెళ్లి వస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి 1.30 గంటల సమయంలో కారు కాల్వలోకి దూసుకెళ్లింది. డ్రైవింగ్ చేస్తున్న వెస్లీ డోరు తీసుకుని బయట పడగా హరీష్ మాత్రం మృతిచెందాడు. 2.30గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. కాని స్టేబుల్ ఎస్‌వీవీ సత్యనారాయణ(చిన్ని) కాల్వలోకి దిగి హరీష్‌ను బయ టకు తీశారు. అప్పటికే హరీష్ మృతిచెందినట్టు గుర్తించారు. జాన్‌వెస్లీ పాలకొల్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్‌ఐ ఎం.నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-12-29T06:08:39+05:30 IST