ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌పై అప్రమత్తత అవసరం

ABN, First Publish Date - 2020-10-31T06:14:46+05:30

జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ అప్రమత్తంగానే ఉండాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అన్నారు. కొవిడ్‌-19 విజృంభించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపరుస్తూ శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు.

ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌, ఇతర అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వొత్తుల ర్యాలీలో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి
డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు 30: జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ అప్రమత్తంగానే  ఉండాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అన్నారు. కొవిడ్‌-19 విజృంభించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  ప్రజలను చైతన్యపరుస్తూ శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. జీజీహెచ్‌ వరకు నిర్వహించిన  ర్యాలీలో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్లు చేకూరి కీర్తి, జి.రాజకుమారి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ కేసుల సంఖ్య సున్నకు చేరాలనే లక్ష్యాన్ని చేరాలంటే వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గత పది రోజులుగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కీలకపాత్ర పోషించారన్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను సబ్బుతో శుభ్రపరచుకోవడంతో కొవిడ్‌ బారిన పడకుండా చూడొచ్చన్నారు. నవంబరు 2న పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ర్యాలీలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ కేవీఎస్‌ గౌరీశ్వరరావు, ఆర్‌ ఎంవో డాక్టర్‌ గిరిధర్‌  పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T06:14:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising