ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోటారు సైకిళ్ల దొంగలు అరెస్టు

ABN, First Publish Date - 2020-10-23T08:43:15+05:30

జిల్లాలో మోటారుసైకిళ్ల దొంగతనాలు అధికంగా జరగడంతో ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మీ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఉన్నతాధికారుల సూచనలతో తుని సీఐ జి.రమే్‌షబాబు పట్టణంలో నలుగురు మోటారు సైకిళ్ల దొంగలను గురువారం అరెస్టు చేశారు.

సమావేశంలో ఎస్పీ నయీమ్‌ అస్మీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 24 బైక్‌లు స్వాధీనం 
  • జిల్లా ఎస్పీ నయీమ్‌ అస్మీ

తుని, అక్టోబరు 22: జిల్లాలో మోటారుసైకిళ్ల దొంగతనాలు అధికంగా జరగడంతో ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మీ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఉన్నతాధికారుల సూచనలతో తుని సీఐ జి.రమే్‌షబాబు పట్టణంలో నలుగురు మోటారు సైకిళ్ల దొంగలను గురువారం అరెస్టు చేశారు. ఈ వివరాలను ఎస్పీ అస్మీ వెల్లడించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట గ్రామానికి చెందిన జక్కలా బాలా సందీప్‌, ఇనుగుబెల్లి సుధాకర్‌, సోళ్ల సూర్య నాగేంద్రకుమార్‌రాజు, వేములపూడి పవ్రీణ్‌లు జల్సాలకు అలావాటుపడి దొంగతాళాల ద్వారా మోటారు సైకిళ్లను దొంగిలించడం ప్రారంభించారు. మోటారు సైకిళ్లు తాకట్టుగా తమ వద్దకు వచ్చాయని, వాటి యజమానులు డబ్బులు కట్టలేక వదిలివేశారని, రికార్డులు తమ వద్ద లేవని నమ్మబలికి తక్కువ ధరకు విక్రయించేవారు. గురువారం తునిలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారని ఎస్పీ తెలిపారు. వీరి నుంచి సుమారు 6 లక్షల విలువచేసే 24 బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని చెప్పా రు. మోటారుసైకిళ్ల రికవరీకి కృషి చేసినపట్టణ సీఐ రమే్‌షబాబు, ఎస్‌ఐ పి.శ్రీనివా్‌సకుమార్‌ ఇతర సిబ్బందికి నగదు బహుమతి, ప్రశంసపత్రాలను ఎస్పీ అందించారు. సమావేశంలో జిల్లా స్పెషల్‌ బ్రాంచ డీఎస్పీ అంబికాప్రసాద్‌, జిల్లా అడిషినల్‌ ఎస్పీ కె.కుమార్‌, పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-23T08:43:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising