ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలు...మళ్ళీ పుట్టవా

ABN, First Publish Date - 2020-09-25T20:36:26+05:30

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి చెందడంతో కాకినాడలో విషాద ఛాయలు నెలకొన్నాయి.. కాకినాడకు చెందిన పలువురు కళాకారులతో ఆయనకు మంచి సత్సంబంధాలున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి చెందడంతో కాకినాడలో విషాద ఛాయలు నెలకొన్నాయి.. కాకినాడకు చెందిన పలువురు కళాకారులతో ఆయనకు మంచి సత్సంబంధాలున్నాయి. నగరంలోని కళాకారులతో కలిసి ఆయన పలు సంగీత విభావరి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆర్కెస్ట్రా పితామహుడు పెద్దిరెడ్డి గంగాధరం మాస్టరు అంటే ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా బాలసుబ్రమణ్యాన్ని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచేవారు. 50 సంవత్సరాల పైగా బాలసుబ్రమణ్యంతో గంగాధరం మాస్టర్‌కి స్నేహసంబంధాలు ఉన్నాయి. కాకినాడకు బాలసుబ్రమణ్యం ఎన్నోసార్లు విచ్చేసినప్పటికీ గంగాధర్ మాస్టర్ కోసమే ప్రత్యేకంగా తొమ్మిది సార్లు వచ్చారు. అంటే వారి మధ్య ఎంత అనుబంధం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాకినాడతో ఆయనకున్న అనుబంధం చెప్పలేనిది. బాలసుబ్రహ్మణ్యం చనిపోవడంతో కళాకారులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కళాకారులు, సంగీత అభిమానులు ప్రార్థిస్తున్నారు.



Updated Date - 2020-09-25T20:36:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising