ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనపర్తిలో పేదలకు 20 వేల ఇళ్ల పట్టాల పంపిణీ

ABN, First Publish Date - 2020-12-30T05:47:59+05:30

రంగంపేట, డిసెంబరు 29: అనపర్తి నియోజకవర్గంలోని పేదలకు 20 వేల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసే అదృష్టం తనకు దక్కిందని, సీఎం జగన్‌తోపాటు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. మండలంలో

ఎస్టీరాజాపురంలో పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి 

రంగంపేట, డిసెంబరు 29: అనపర్తి నియోజకవర్గంలోని పేదలకు 20 వేల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసే అదృష్టం తనకు దక్కిందని, సీఎం జగన్‌తోపాటు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఈలకొలను, ఎస్టీరాజాపురం గ్రామాల్లో 376 మంది పేదలకు ఇళ్ల పట్టాలను ఆయన పంపిణీ చేసి అనంతరం మాట్లాడారు. గత ఉగాది నాటికి పట్టాలు పంపిణీ చేయాల్సి ఉందని, ప్రతిపక్షం కోర్టులో కేసులు వేయడం వల్ల ఆలస్యమయ్యిందన్నారు. పట్టాలు రిజిస్టర్‌ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆలోచన అని, లబ్ధిదారులు 5 సంవత్సరాల అనంతరం అమ్ముకునే వీలు కల్పించారని తెలిపారు. కోర్టు కేసులవల్ల ప్రస్తుతం డీ పట్టాలు మాత్రమే అందిస్తున్నామని, కేసులు తేలాక రిజిస్ర్టేషన్‌ చేస్తారని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ నల్లా శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షుడు లంక చంద్రన్న, వైసీపీ నాయకులు కె.ఇశ్రాయిల్‌, ఆర్‌.అబ్బు, పి.బులివీర్రాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:47:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising