ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనపర్తి ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టడంలో విజయం సాధించాం

ABN, First Publish Date - 2020-12-29T07:02:28+05:30

అనపర్తి, డిసెంబరు 28: ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సవాల్‌ చేసినట్టుగా సత్య ప్రమాణం చేశానని, ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టడంలో విజయం సాధించామని, ఈ విజయం టీడీపీ నాయకులు, కార్యకర్తలదేనని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం

సమావేశంలో మాట్లాడుతున్న రామకృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

అనపర్తి, డిసెంబరు 28: ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సవాల్‌ చేసినట్టుగా సత్య ప్రమాణం చేశానని, ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టడంలో విజయం సాధించామని, ఈ విజయం టీడీపీ నాయకులు, కార్యకర్తలదేనని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రామవరంలో జరిగిన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో రామకృష్ణారెడ్డి మా ట్లాడారు. సత్య ప్రమాణాల ఎపిసోడ్‌లో అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు ఏర్పరచినా చివరకు మీడి యా ద్వారా చర్చ జరిగిందన్నారు. తన పోరాట పటిమను మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురు సీనియర్‌ నాయకులు ప్రశంసించడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు, నాయకులు ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ అవినీతి, ప్రజా సమస్యలపైనా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటేవిధంగా కృషి చేయాలని ఆయ న కోరారు. సమావేశంలో ఆళ్ల గోవిందు, త్రిమూర్తులు, సిరసపల్లి నాగేశ్వరరావు, కర్రి వెంకటరామారెడ్డి, జుత్తుగ సూర్యకుమారి కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, తమలంపూడి సుధాకరరెడ్డి పాల్గొన్నారు.

యనమలను కలిసిన రామకృష్ణారెడ్డి 

టీడీపీ సీనియర్‌ నాయకుడు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిని మాజీ ఎమ్మె ల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల సత్య ప్రమాణాల విషయంలో రామకృష్ణారెడ్డి చూపిన తెగువను ఆయన ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.

Updated Date - 2020-12-29T07:02:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising