ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్యాణానికి ముందే నూతన రథాన్ని సిద్ధం చేస్తాం: మంత్రి వేణు

ABN, First Publish Date - 2020-10-23T08:22:42+05:30

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి నూతన రథం నిర్మాణ పనులను వేగవంతం చేసి డిసెంబరుకు సిద్ధం చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతర్వేది, అక్టోబరు 22: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి నూతన రథం నిర్మాణ పనులను వేగవంతం చేసి డిసెంబరుకు సిద్ధం చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. గురువారం ఆయన దేవదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గిరిజాశంకర్‌, కమిషనరు పి.అర్జునరావులతో కలిసి నూతన రథం తయారీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామివారి కల్యాణానికి ముందే నూతన రథాన్ని సిద్ధం చేస్తామన్నారు. 25 రోజుల్లోనే రథ చక్రాలు, రెండు అంతస్థుల పనులను అధికారులు, సిబ్బంది పూర్తి చేయడంపట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. తొలుత మంత్రి, ఉన్నతాఽధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. వారి వెంట అమలాపురం సబ్‌ కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు దేవదాయశాఖ ప్రత్యేకాధికారి కె.రామచంద్రమోహన, ఆర్జేసీ డి.భ్రమరాంబ, ఉప కమిషనరు దుర్గాప్రసాద్‌, సింహాద్రి, గణపతి ఆచార్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-23T08:22:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising