అంగనవాడీ భవన నిర్మాణానికి స్థల వితరణ
ABN, First Publish Date - 2020-11-13T05:38:13+05:30
తాళ్లరేవు మండలం పిల్లంకలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి అవసరమైన 4.75 సెంట్ల స్థలాన్ని ముమ్మిడివరానికి చెందిన టీడీపీ నాయకుడు తాడి నరసింహారావు, ఆయన సోదరుడు తాడి కాశి సమకూర్చారు. దస్తావేజులను ముమ్మిడివరంలో గురువారం నరసింహారావు గ్రామస్తులకు అందజేశారు.
ముమ్మిడివరం, నవంబరు 12: తాళ్లరేవు మండలం పిల్లంకలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి అవసరమైన 4.75 సెంట్ల స్థలాన్ని ముమ్మిడివరానికి చెందిన టీడీపీ నాయకుడు తాడి నరసింహారావు, ఆయన సోదరుడు తాడి కాశి సమకూర్చారు. దస్తావేజులను ముమ్మిడివరంలో గురువారం నరసింహారావు గ్రామస్తులకు అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రానికి స్వర్గీయ తాడి తాతారావు పేరు పెడతామని గ్రామస్తులు, పంచాయతీ అధికారులు చెప్పారు. కార్యక్రమంలో గుత్తాల రామకృష్ణ, కోరుకొండ బాలకృష్ణ, కోరుకొండ ఈశ్వరరావు, గెడ్డం ఏడుకొండలు, కాగిత వెంకట్రావు, యాళ్ల ఉదయ్, దాట్ల బాబు, పొత్తూరి విజయభాస్కరవర్మ, రెడ్డి బాలకృష్ణ, ములపర్తి బాలకృష్ణ, విళ్ల వీరాస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-13T05:38:13+05:30 IST