వేతనాలు అందక ఓవర్‌హెడ్ ట్యాంకు ఎక్కి నిరసన
ABN, First Publish Date - 2020-12-29T07:23:14+05:30
అమలాపురం టౌన్, డిసెంబరు 28: కొవిడ్ బారిన వారి ఆరోగ్యం కోసం సంపూర్ణ పారిశుధ్య సేవలు అందించారు. నెలలు గడిచిపోతున్నా వేతనాలు
అమలాపురం టౌన్, డిసెంబరు 28: కొవిడ్ బారిన వారి ఆరోగ్యం కోసం సంపూర్ణ పారిశుధ్య సేవలు అందించారు. నెలలు గడిచిపోతున్నా వేతనాలు చెల్లించకపోవడం, అధికా రుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సోమవారం మధ్యాహ్నం పారిశుధ్య కార్మికులైన గాడా వినయ్, ధనాల దానయ్యలు అమలాపురం పురపాలక సంఘ కార్యాలయం ఆవరణలో ఉన్న రక్షిత మంచినీటి ఓవర్‌హెడ్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న సమ యంలో బోడసకుర్రులోని కొవిడ్ కేర్ సెంటర్‌లో నాలుగు నెలల ఐదు రోజులపాటు పట్టణానికి చెందిన 30 మంది పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి పారిశుధ్య పనులు చేపడితే, తమకు ఇంతవరకు వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. నెలలు గడిచిపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. తమ సమస్యను పరి ష్కరించేంత వరకు కిందకు దిగేది లేదని భీష్మించారు. సమాచారం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ ఎ.పరదేశి, మున్సి పల్ డీఈ అప్పలరాజులు ఓవర్‌హెడ్ ట్యాంకు ఎక్కిన యువకులతో చర్చించారు. పారిశుధ్య సేవలు అందించిన కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతోపాటు ఈ విషయంపై మంగళవారం ఉద యం సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించడంతో వారు నిరసన విరమించి కిందకి దిగి వచ్చారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ వి.అయ్యప్పనాయుడు మాట్లాడుతూ కొవిడ్‌కేర్ సెంటర్‌లో సేవలు అందించిన పారిశుధ్య కార్మికుల వేతన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. సమస్య తీవ్రతను రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు.
Updated Date - 2020-12-29T07:23:14+05:30 IST