ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం..

ABN, First Publish Date - 2020-05-23T16:45:27+05:30

రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి సోమవారం సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు నడపడా నికి కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి 25న విమానాలు ప్రారంభం

ప్రతిరోజు హైదరాబాద్‌, రోజు విడిచి రోజు చెన్నైకు సర్వీసులకు ఇండిగో ఓకే

నాలుగు గంటలు ముందే ఎయిర్‌ పోర్టుకు ప్రయాణికులు రావాలనే షరతు 


(కాకినాడ ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి సోమవారం సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు నడపడా నికి కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇండిగో తన సర్వీసులను నడపడానికి ముందుకొచ్చింది. అందులోభాగంగా రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌, చెన్నై రూట్లలో విమానాలు తిప్ప నుంది. అయితే ఆరంభంలో కొద్దిరోజులు కేవలం ఒక్క సర్వీస్‌ మాత్రమే నడపాలని ఇండిగో నిర్ణయించింది. ప్రతి రోజు హైదరాబాద్‌కు ఒకటి, రోజువిడిచి రోజు చెన్నైకు ఒక సర్వీసు తిప్పనుంది. ఏయే సమయాల్లో ఈ సర్వీసులు ఉంటాయనేది శనివారం అధికారికంగా వెల్లడికానుంది. మరోపక్క కొవిడ్‌ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. విమానం ఎక్కడానికి నాలుగు  గంటలు ముందు విమానాశ్రయానికి ప్రయాణికులు చేరుకోవాలనే నిబంధనల్లో భాగంగా లోపల ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రవేశద్వారం వద్ద థర్మల్‌ స్ర్కీనింగ్‌, చేతులు శుభ్రపర్చుకునేలా హ్యాండ్‌ శానిటైజర్లు ఇతరత్రా ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2020-05-23T16:45:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising